బడి బస్సుకు పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

బడి బస్సుకు పరీక్షలు

May 2 2025 1:56 AM | Updated on May 2 2025 1:56 AM

బడి బ

బడి బస్సుకు పరీక్షలు

హిందూపురం అర్బన్‌: అసలే కాలం చెల్లిన బస్సులు.. డ్రైవింగ్‌ లైసన్స్‌ లేని డ్రైవర్లు.. రాష్‌ డ్రైవింగ్‌.., బస్సులకు అరిగిన టైర్లు.. సక్రమంగా పని చేయని క్లచ్‌లు.. తరచూ ఫైయిలయ్యే బ్రేకులు ఇదీ చాలా వరకూ ప్రైవేట్‌ విద్యాసంస్థల బస్సుల పరిస్థితి. ఏటా బస్సుల ఫిట్‌నెస్‌ పరీక్షలు జూన్‌ 15 కల్లా పూర్తి కావాలి. జిల్లా వ్యాప్తంగా ఫిట్‌నెస్‌ పరీక్షలు గత నెల 25 నుంచి ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో పలు విద్యాసంస్థల యాజమాన్యాలు తమ బస్సుల ఫిట్‌నెస్‌కు సిద్ధమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 509 విద్యా సంస్థలకు చెందిన బస్సులు ఉండగా, ఇప్పటి వరకూ 40కి పైగా బస్సులు రవాణాశాఖ ద్వారా ఫిట్‌నెస్‌ పొందాయి. ఈ నెల 15వ తేదీ వరకూ పర్మిట్‌ ఉండడంతో రోజూ 5 నుంచి పది బస్సులు ఫిట్‌నెస్‌ పరీక్షకు వస్తున్నాయి.

నిబంధనలు ఇలా..

విద్యా సంస్థల బస్సులు నడపాలంటే డ్రైవర్‌కు 50 ఏళ్ల లోపు వయస్సు ఉండాలి. పదేళ్ల అనుభవంతో పాటు హెవీ వెహికల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ తప్పని సరిగా కలిగి ఉండాలి. డ్రైవర్‌, సహాయకుడు తప్పని సరిగా యూనిఫాం ధరించాలి. వేగంగా.. నిర్లక్ష్యంగా బస్సు నడపరాదు. విద్యార్థులు బస్సు ఎక్కే సమయంలో, దిగే సమయంలో జాగ్రత్త వహిస్తూ.. విద్యార్థుల కదలికలపైనే దృష్టి పెట్టాలి. ప్రథమ చికిత్స బాక్స్‌, బస్సు స్పీడ్‌ కంట్రోల్‌ చేసే స్పీడ్‌ గౌవర్నర్‌ కలిగి ఉండాలి. బస్సుపై పాఠశాల పేరు, చిరునామా, ఫోన్‌ నంబర్‌ ఉండాలి. అయితే నిబంధనలు పాటించడంలో జిల్లాలోని కొన్ని విద్యా సంస్థలు నిర్లక్ష్యం వహిస్తున్నట్లు సమాచారం. రవాణాశాఖ అధికారుల నిబంధనలు అతిక్రమించి కండీషన్‌ లేని బస్సుల్లోనే విద్యార్థులను తరలిస్తున్నారు. అంతేకాక డ్రైవింగ్‌ అరకొరగా వచ్చిన యువకులను ఏర్పాటు చేసుకుని కాలం నెట్టుకొస్తున్నారు. ఫిట్‌నెస్‌లేని బస్సులను అతి వేగంగా నడపడంతో వల్ల పలుమార్లు ప్రమాదాలు చోటు చేసుకున్న ఘటనలూ ఉన్నాయి.

ఫిట్‌నెస్‌ జారీ ఇలా..

ఫిట్‌నెస్‌ పరీక్షకు వచ్చిన బస్సును ముందుకుగా మోటర్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ నడిపి చూస్తారు. ఆ సమయంలోనే బ్రేకులు, క్లచ్‌, స్టీరింగ్‌, హ్యాండ్‌ బ్రేక్‌ పనితీరు, బ్యాటరీ సామర్థ్యం, ఇంజిన్‌ కండిషన్‌ను పరిశీలించి, ఏవైనా లోపాలు గుర్తిస్తే వాటిని మరమ్మతు చేసుకోవాలని సూచిస్తారు. అంతేకాక అత్యవసర ద్వారం, కిటికీలు, టైర్లు కంండీషన్‌గా లేకున్నా ఫిట్‌నెస్‌ జారీ చేయకుండా నిలిపివేస్తారు.

ప్రైవేట్‌కు అనుమతులు

జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకూ ఫిట్‌నెస్‌ (సామర్థ్య) పరీక్షలు రవాణా ఇన్‌స్పెక్టర్లు చేసేవారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫిట్‌నెస్‌ ధ్రువపత్రాలు జారీ చేసేందుకు బుక్కపట్నంలోని ఓ ప్రైవేట్‌ సంస్థకు ఇచ్చారు. ప్రస్తుతం వారు అక్కడ సొంతంగా డిజిటల్‌ ట్రాకింగ్‌, ఫిట్‌నెస్‌కు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. మరో నెల రోజుల్లో ఈ ఫిట్‌నెస్‌ కేంద్రం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇది పూర్తయితే ఇకపై జిల్లా వ్యాప్తంగా ఏ వాహనమైనా ఫిట్‌నెస్‌ పొందాలంటే అక్కడికి క్యూ కట్టాల్సిందే.

జిల్లాలో మొదలైన ప్రైవేట్‌ స్కూల్‌ బస్సుల సామర్థ్య పరీక్షలు

కండీషన్‌లో ఉంటేనే అనుమతులు

విద్యా సంస్థల బస్సులకు ఫిట్‌నెస్‌ పరీక్షలు మొదలు పెట్టాం. వచ్చిన వాహనాల కండీషన్‌ బట్టి ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్నాం. జూన్‌ 15వ తేదీలోపు అన్ని బస్సులు ఫిట్‌నెస్‌ పూర్తి చేసుకోవాలి. ప్రస్తుతం హిందూపురం, కదిరి, ధర్మవరం ఇలా ఎక్కడికక్కడ మోటర్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్లు పరీక్షలు నిర్వహించి అన్ని సక్రమంగా ఉన్న వాటికే అనుమతులు జారీ చేస్తున్నారు. బస్సులు ఫిట్‌నెస్‌ లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ రోడ్లపై తిరగనివ్వం.

– కరుణసాగరరెడ్డి,

జిల్లా రవాణాధికారి, హిందూపురం

బడి బస్సుకు పరీక్షలు1
1/1

బడి బస్సుకు పరీక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement