కదిరి టౌన్: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం విధులను బహిష్కరించనున్నట్లు ఎన్టీఆర్ వైద్య సేవ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు షేక్‌బాబ్‌జాన్, పవన్‌కుమార్, అమరేంద్ర హరికృష్ణ తెలిపారు. ఈమేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. విధుల బహిష్కరణపై ఇప్పటికే జిల్లా కోఆర్డినేటర్‌కు వినతిపత్రం అందించామని తెలిపారు. సమస్యలు పరిష్కరించకపోతే యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈనెల 17, 24 తేదీల్లో కూడా విధులను బహిష్కరించనున్నట్లు పేర్కొన్నారు.
కల్లు దుకాణం పై దాడి
మడకశిర: పట్టణంలోని చీపులేటిలో శనివారం రాష్ట్ర ఎకై ్సజ్ టాస్క్‌ఫోర్స్ అధికారులు కల్లు దుకాణం పై దాడి చేశారు. ఈసందర్భంగా కల్తీకల్లు, కల్తీ చేయడానికి వినియోగించే మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకోవడంతోపాటు పలువురిని అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఈ కల్లు దుకాణాన్ని లైసెన్స్‌దారుడు కాకుండా వేరే వ్యక్తి నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ఎకై ్సజ్ టాస్క్ ఫార్స్ అధికారులకు అందిన సమాచారం మేరకు ఈ దాడి చేసినట్లు సమాచారం. స్థానిక ఎకై ్సజ్ అధికారులు కూడా ఈ ఘటనపై వివరాలను అందించలేదు.
మామిడి, చింతచెట్లు దగ్ధం
గుడిబండ: మందలపల్లి సమీపంలోని కొండకు నిప్పుపెట్టడంతో దగ్గరలోని మామిడి, చింతచెట్లు దగ్ధమయ్యాయి. బాధిత రైతుల వివరాల మేరకు.. రైతు చిక్కన్న, సన్నమారప్ప 30 ఏళ్లుగా మామిడి, చింత, కొబ్బరి చెట్లను అభివృద్ధి చేశారు. శనివారం మధ్యాహ్నం ఆకతాయిలు ఎండుగడ్డికి నిప్పుపెట్టడంతో చిక్కన్న, సన్నమారప్ప తోటలకు వ్యాపించాయి. గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బందిని మంటలు ఆర్పివేశారు. అయితే అప్పటికే దాదాపు 400 మామిడి చెట్లు, 100 చింత చెట్లు కాలి బూడిదయ్యాయి. ఘటనలో దాదాపు రూ.20 లక్షలు నష్టం వాటిల్లినట్లు బాధితులు వాపోయారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు.