
కరోనాకు ముందు ఉపాధి కోసం బెంగళూరుకు వెళ్లి నా భర్త శివప్రసాద్ ప్రైవేట్ వాహనాలకు డ్రైవర్‌గా, నేను హోటల్‌లో కూలి పనికి వెళ్లేవాళ్లం. మాకు ఇద్దరు కుమార్తెలు. కరోనా కారణంగా సొంతూరికి తిరిగి వచ్చాం. అప్పటి నుంచి ఇక్కడే కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. మా పెద్ద కుమార్తెకు ఎలాంటి సర్టిఫికెట్లు లేకపోవడంతో బడిలో చేర్పించలేకపోయాం. ఈ విషయం తెలుసుకున్న వలంటీర్ నేరుగా వచ్చి వివరాలు తీసుకెళ్లి జగనన్న సురక్ష కార్యక్రమంలో జనన ధ్రువీకరణ పత్రం ఇప్పించాడు. ఇవి పొందడానికి గతంలో మేము ఎన్ని తిప్పలు పడ్డామో ఆ దేవుడికే తెలియాలి. ఒక్క పైసా ఖర్చు లేకుండా సర్టిపికెట్లు మంజూరు చేసి, మా కుమార్తెను ఆరో తరగతిలో చేర్పించేందుకు మార్గం సుగమం చేసిన సీఎం వైఎస్ జగన్‌కు ఎంతో రుణపడ్డాం.
– నాగవేణి, అంబేడ్కర్ కాలనీ, బత్తలపల్లి
పింఛనే ఆధారం
వ్యవసాయ కూలి పనులతో జీవనం సాగించే మాకు వృద్ధాప్యం కారణంగా పనులు చేయలేక పోతున్నాం. గతంలో నా భార్యకు రెండు కళ్లు సరిగా కనపడక పోవడంతో ఆపరేషన్ చేయించా. అది కాస్త ఫెయిల్ అయింది. సీఎంగా వైఎస్ జగన్ వచ్చిన తర్వాత నాకు రూ.2,750, నా భార్యకు రూ.3వేలు పింఛన్ అందుతోంది. ఈ డబ్బుతో ఎవరి మీద ఆధారపడకుండా మేము హాయిగా జీవిస్తున్నాం. మాలాంటి నిర్భాగ్యులకు అండగా నిలిచిన సీఎం వైఎస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాం.
– ఖాదర్, షకీనా దంపతులు,
టి.రెడ్డివారిపల్లి, తలుపుల మండలం
ఈ ఇల్లు జగనన్న వరప్రసాదం
నేను టైలరింగ్‌తో, నా భర్త షరాబ్ యోగానందాచారి బంగారు దుకాణంలో పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. 20 ఏళ్లుగా బత్తలపల్లిలోనే ఉంటున్న మాకు సొంతిల్లు ఉండేది కాదు. స్థలం కొందామంటే ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత బత్తలపల్లిలోని తాడిపత్రి రోడ్డులో రూ.4లక్షలు విలువ చేసే ఇంటి స్థలం మంజూరైంది. ఇప్పుడు మేముంటున్న ఇల్లు ఆ స్థలంలో కట్టుకున్నదే. ఇది ఆ జగనన్న వరప్రసాదంగా భావిస్తున్నాం. – షరాబ్ భవాని, బత్తలపల్లి
రూ.2 లక్షలకు పైగా లబ్ధి పొందా
ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకూ రూ.2 లక్షలకు పైగా లబ్ధి చేకూరింది. ఇంటి స్థలం ఉండగా పక్కా గృహం కట్టించి ఇచ్చారు. జనానికి మంచి చేసే జగనన్న మరో పది కాలల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరుకుంటున్నా.
– సవిత, కల్లూరు, లేపాక్షి మండలం



