
మృతురాలు పుష్పలత
పెనుకొండ రూరల్: సంతానం కలుగక పోవడంతో జీవితంపై విరక్తి చెందిన ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... పెనుకొండ మండలం మరువపల్లికి చెందిన పుష్పలత (30)కు గుట్టూరు నివాసి మహేంద్రతో పదేళ్ల క్రితం వివాహమైంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుతో గుట్టూరు పంచాయతీ 1వ వార్డు సభ్యురాలిగా గెలుపొందింది. అయితే పైళ్లె పదేళ్లు గడిచినా సంతానం కలుగకపోవడంతో తీవ్ర మనోవేదనకు లోనైన ఆమె శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆదివారం వేకువజామున ఈ విషయాన్ని గమనించిన కుటుంబసభ్యుల సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఘటనపై ఎస్‌ఐ రమేష్‌బాబు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.