మత్స్యకారులు తరలిరావాలి | - | Sakshi
Sakshi News home page

మత్స్యకారులు తరలిరావాలి

Apr 15 2026 7:26 AM | Updated on Apr 15 2026 7:26 AM

మాజీ మంత్రి ప్రసన్న పిలుపు

కోవూరు : మత్స్యకారుల సమస్యలను తెలుసుకుని వారి హక్కుల కోసం గళమెత్తేందుకు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బోగోలు మండలం జువ్వలదిన్నెలో బుధవారం పర్యటించనున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి మంగళవారం తెలిపారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మత్స్యకారులకు అన్ని విధాలా అండగా నిలిచిందన్నారు. వారి జీవనోపాధికి జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణం చేపట్టిందన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం మత్స్యకారులను నిర్లక్ష్యం చేస్తోందని, వారికి అందాల్సిన పథకాలు, హక్కులను కాలరాస్తోందని దుయ్యబట్టారు. ఈ నేపథ్యంలో మత్స్యకారుల సమస్యలను నేరుగా తెలుసుకుని పోరాడేందుకు జగనన్న స్వయంగా తరలి వస్తున్నారని తెలిపారు. మత్స్యకారులతో పాటు పార్టీ శ్రేణులు హాజరై జగనన్న పర్యటనను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement