వేట లేక తీవ్ర ఇబ్బందులు పడుతుంటే మమ్మల్ని ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోంది. గతంలో వేట విరామ సాయం ముందుగానే అదించేవారు. ఇప్పుడు ప్రభుత్వం అనేక నిబంధనలతో పరిహారానికి కొర్రీలు పెడుతోంది. దీంతో మా బతుకులు భారమై సమీప కంపెనీల్లో కూలీలుగా వెళ్లాల్సి వస్తోంది. – మునస్వామి,
మత్స్యకారుడు, ఓడపాళెం
ఏడాది మొత్తం వేట విరామమే..
రెండేళ్లుగా సముద్రంపై వేట సక్రమంగా సాగడం లేదు. ఈ ఏడాది పొడుగునా వేట లేక ఆకలితో అలమటిస్తున్నాం. ఆదుకోవాల్సిన ప్రభుత్వ నేతలు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఈ ప్రభుత్వం మత్స్యకారులకు అడుగడుగునా ద్రోహం చేస్తూనే ఉంది. గత జగనన్న ప్రభుత్వంలో మత్స్యకారులకు పథకాలు అందేవి.
– పోలయ్య, మత్స్యకారుడు,
కొండూరుపాళెం
●


