సమస్యలు పరిష్కరించాలని వినతి | - | Sakshi
Sakshi News home page

సమస్యలు పరిష్కరించాలని వినతి

Jan 20 2026 8:29 AM | Updated on Jan 20 2026 8:29 AM

సమస్యలు పరిష్కరించాలని వినతి

సమస్యలు పరిష్కరించాలని వినతి

నెల్లూరు(దర్గామిట్ట): నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్‌ హిమాన్షు శుక్లా, జాయింట్‌ కలెక్టర్‌ మొగిలి వెంకటేశ్వర్లు, జిల్లా రెవెన్యూ అధికారి విజయ్‌ కుమార్‌, డీఆర్‌డీఏ పీడీ నాగరాజకుమారి, సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ డీడీ నాగశేఖర్‌, జెడ్పీ సీఈఓ శ్రీధర్‌రెడ్డి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ భూ సమస్యలు, రెవెన్యూ అంశాలు, పింఛన్లకు సంబంధించి అర్జీలు ఎక్కువగా వస్తున్నాయని వాటిని పరిష్కరించాలన్నారు.

● జంతు హింస నిరోధక చట్టాలను కఠినంగా అమలు చేయాలంటూ న్యాయవాది, సామాజికవేత్త ఇర్ల వెంకటరమణయ్య జేసీ మొగిలి వెంకటేశ్వర్లుకు వినతిపత్రమిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పండగల సమయంలో జూదం, అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చూడాలని కోరారు. ఆయన వెంట కొండలరావు, మల్లికార్జునరావు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement