
‘కూటమి’ తెచ్చిన కష్టం
కొత్త కార్డుల కోసం గుమిగూడారిలా..
నవలాకులతోటలో రేషన్ కోసం వేచి ఉన్న జనం
నాటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఎండీయూ వాహనాలు ఇంటింటికీ వెళ్లి రేషన్ అందజేసేవి. నేడు లబ్ధిదారులు పనులు మానుకుని షాపుల ముందు క్యూలైన్‌లో ఉంటున్నారు. శుక్రవారం నెల్లూరు నవలాకులతోట ప్రాంతంలో రేషన్ దుకాణం వద్ద బియ్యం తీసుకునేందుకు గంటల తరబడి వేచి చూశారు. కొందరు వృద్ధులు ఉండలేక బియ్యం తీసుకోకుండానే వెళ్లిపోయారు. మరోవైపు నూతన కార్డులు తీసుకునేందుకు అవస్థలు పడుతున్నారు. కూటమి ప్రభుత్వం పెడుతున్న కష్టాలపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరు

‘కూటమి’ తెచ్చిన కష్టం