
తప్పుడు వాంగ్మూలాలతో నాపై అక్రమ కేసులు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘నేను తప్పు చేసినట్లు ఏ ఒక్క ఆధారం చూపించండి. ఏ శిక్షకై నా నేను సిద్ధంగా ఉన్నాను. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడం, సర్వేపల్లిలో జరిగే అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకు బలవంతంగా తీసుకున్న తప్పుడు వాంగ్మూలాలతో నాపై తప్పుడు కేసులు బనాయించారు. ఈ రెండు రోజుల కస్టడీలో నా ప్రమేయం ఉన్నట్లు ఒక్క ఆధారం చూపించినా నేను స్పందిస్తానంటూ మాజీమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఎకై ్సజ్ శాఖ అధికారులకు స్పష్టం చేశారు. పొదలకూరు మండలం ఇరువూరులో గత ఎన్నికల సమయంలో పట్టుబడిన మద్యం కేసులో మాజీ మంత్రి కాకాణిపై అక్రమంగా కేసు నమోదు చేశారు. ఈ కేసులో విచారణ నిమిత్తం రెండు రోజుల పాటు ఎకై ్సజ్ శాఖ అధికారుల న్యాయమూర్తి ఆదేశాలతో సోమవారం తమ కస్టడీకి తీసుకున్నారు. కాకాణి తరఫు న్యాయవాది కే చంద్రశేఖర్ సమక్షంలో తొలి రోజు 50 ప్రశ్నలకు కాకాణి దీటైన సమాధానాలు ఇచ్చారు. ‘నా మీద ఉన్నవి కేవలం ఆరోపణలే తప్ప వాస్తవాలు కావనే విషయం మీకూ తెలుసు. నిజానిజాలు మీ దర్యాప్తులో తేల్చాలి. ఎటువంటి ఆధారాలు లేకుండా కేవలం బలవంతపు వాంగ్మూలాలతో నమోదు చేసిన అక్రమ కేసే ఇది. నేను మిమ్మల్ని స్పష్టంగా కోరేది ఈ రెండు రోజుల కస్టడీలో నా మీద మీరు సేకరించిన ఆధారాలు చూపించండి. అప్పుడు స్పందిస్తాను’ అని ఎకై ్సజ్ అధికారులకు స్పష్టం చేసినట్లు సమాచారం.
అక్రమ ప్రయోజనాన్ని
ఆశించాల్సిన అవసరం లేదు
‘నేను ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎన్నడూ అక్రమ ప్రయోజనాన్ని ఆశించలేదు. మీ విచారణలో నేను దోషిగా తేలితే ఎటువంటి శిక్షకై నా సిద్ధం. బచ్చల సురేష్‌కుమార్‌రెడ్డి, చొప్ప రమేష్, కేతు రామిరెడ్డి, వెలిమిరెడ్డి వీరందరు వైఎస్సార్‌సీపీ నేతలు కావడంతో వారిని ఈ కేసుల్లో అన్యాయంగా ఇరికించారు. వారితో నేను తరచూ గ్రామాభివృద్ధి విషయాలు మాత్రమే మాట్లాడుకుంటాం. అభియోగాలకు, వాస్తవాలకు చాలా వ్యత్యాసం ఉంది. మీరు అడిగే ప్రశ్నలన్నీ ఊహా జనీతం. డొంక తిరుగుడు ప్రశ్నలు కాకుండా నాపాత్రపై నిర్ధిష్టమైన ఆధారాలు చూపిస్తే నేను సమాధానం చెప్పగలను. నేను మద్యం ద్వారా ఓటర్లను ప్రభావితం చేయాలన్న ఆలోచనే చేయలేదు’ అని ఎకై ్సజ్ అధికారుల ప్రశ్నలకు కాకాణి దీటైన సమాధానాలు ఇచ్చారు.
మొదటి రోజు కాకాణి విచారణ పూర్తి
ఎకై ్సజ్ అధికారులకు
కాకాణి దీటైన సమాధానాలు
ఒక్క ఆధారమైనా చూపిస్తే
ఏ శిక్షకై నా సిద్ధమే
కాకాణి ఎదురు ప్రశ్నలకు నీళ్లు నమిలిన అధికారులు
నెల్లూరు (లీగల్): మాజీమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని పొదలకూరు ఎకై ్సజ్ ఇన్‌స్పెక్టర్ వి.వెంకటేశ్వరరావు సోమవారం విచారించారు. పొదలకూరు మండలం విరువూరులో మద్యం అక్రమ నిల్వలు ఉంచారంటూ 9వ నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో జిల్లా కేంద్ర కారాగారంలో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న కాకాణిని గూడూరు కోర్టు అనుమతితో పొదలకూరు ఎకై ్సజ్ అధికారులు రెండు రోజుల విచారణ నిమిత్తం సోమవారం తమ కస్టడీకి తీసుకుని జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రానికి తరలించారు. కాకాణిని ఆయన తరఫు న్యాయవాది కోరికల చంద్రశేఖర్ సమక్షంలో 50 ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. పొదలకూరు మండలం తోడేరు, పొదలకూరు–3 వీఆర్‌ఓలు గడ్డం వేణుగోపాల్, అల్లాడి శ్రీనివాసులు మధ్యవర్తులుగా ఉంచి ఈ విచారణ చేపట్టారు. సాయంత్రం 5 గంటలకు కాకాణిని జిల్లా కేంద్ర కారాగారానికి తరరించారు.