
7న జిల్లా స్థాయి అండర్–7 చెస్ ఎంపికలు
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): నెల్లూరు జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 7న జిల్లా స్థాయి అండర్–7 చెస్ చాంపియన్‌షిప్ ఎంపికలు–2025 జరుగుతాయని ఆ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎన్.మంజుల, పి.మస్తాన్‌బాబు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పొగతోటలోని రాయ్ చెస్ అకాడమీలో జరుగుతాయని, పోటీల్లో పాల్గొనదలచిన వారు 96033 45326 మొబైల్ నంబరుకు ఫోన్ చేసి తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.
ఆగని సీహెచ్‌ఓల ఆందోళన
నెల్లూరు (అర్బన్): జిల్లాలోని విలేజ్ హెల్త్ క్లినిక్స్ (ఆయుష్మాన్ భారత్ కేంద్రాలు)లో పని చేస్తున్న సీహెచ్‌ఓలు ఆదివారం సైతం నగరంలోని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖా కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు. గ్రామీణ ప్రాంతంలో విలేజ్ హెల్త్ క్లినిక్‌లను మూసేసి వారు చేస్తున్న ఆందోళన 8 రోజుకు చేరింది. సీహెచ్‌ఓ అసోసియేషన్ జిల్లా కోఆర్డినేటర్ ఆదిల్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమ న్యాయమైన డిమాండ్లు తీర్చాలని కోరారు. వైద్యశాఖ మంత్రి సత్యకుమార్‌యాదవ్ వద్దకు వెళ్లి తమ బాధలు చెప్పుకోవాలని ప్రయత్నిస్తే ఆయన హీనంగా చూసి బెదిరింపు ధోరణితో మాట్లాడడం బాధాకరమన్నారు. తాము ప్రభుత్వాన్ని విమర్శించడం లేదని తమ బాధలు వినేందుకు అవకాశం కల్పించాలని కోరారు. మంత్రి తమ మాటలు వెనక్కి తీసుకోవాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెను ఆపేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు భానుమహేష్, కార్యదర్శి రెబకా, పలువురు సీహెచ్‌ఓలు పాల్గొన్నారు.
ఖనిజాన్ని తరలిస్తున్న లారీ సీజ్
● ఆరుగురిపై కేసు నమోదు
సైదాపురం: స్పోక్ క్వార్ట్ ్జ ఖనిజాన్ని అక్రమంగా తరలించేందుకు లోడింగ్ చేస్తున్న లారీని ఆదివారం పోలీసులు స్వాధీనం చేసుకుని ఆరుగురిపై కేసు నమోదు చేశారు. సైదాపురం తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఉన్న యార్డు నుంచి ఆదివారం తెల్లవారుజామున క్వార్ట్ ్జ ఖనిజాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఎస్‌ఐ క్రాంతికుమార్ తన సిబ్బందితో కలిసి దాడులు చేశారు. ఖనిజాన్ని లోడింగ్ చేస్తున్న లారీని స్వాధీనం చేసుకున్నారు. వీఆర్వో హజరత్తయ్య ఫిర్యాదు మేరకు పనులు చేయిస్తున్న ఆరుగురిపై క్రిమినల్ కేసులను నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఘనంగా భగీరథ
మహర్షి జయంతి
నెల్లూరు(అర్బన్): నగరంలోని కలెక్టరేట్ శంకరన్ హాల్లో ఆదివారం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భగీరథ జయంతిని ఘనంగా నిర్వహించారు. భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డీఆర్‌ఓ ఉదయభాస్కర్‌రావు మాట్లాడుతూ గంగను భువికి తెచ్చిన మహనీయుడు భగీరథ మహర్శిని స్మరించడం, పూజించడం మన కర్తవ్యమని తెలిపారు.