
అండర్‌పాస్‌లు లేక..
రోడ్డును రెండు వరుసలుగా నిర్మించినా ఎక్కువగా మలుపు ఉండటం, అండర్‌పాస్‌లు లేకపోవడం ప్రమాదాలకు కారణంగా మారింది. 45 కిలోమీటర్ల పొడవులో జాతీయ రహదారి నుంచి అనేక గ్రామాలకు వెళ్లే రోడ్లున్నాయి. ప్రధానంగా కందుకూరు బైపాస్‌రోడ్డులో కూడా చుట్టుగుంట, దివివారిపాళెం, కొండముడుసుపాళెం వంటి గ్రామాలకు వెళ్లేందుకు ఈ రోడ్డును దాటాలి. అయితే ఈ ప్రాంతాల్లో అండర్‌పాస్‌లు లేవు. కందుకూరు నుంచి కావలి వైపు వెళ్లే రోడ్డు కొండముడుసుపాళెం వద్ద క్రాస్ అవుతుంది. నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. అటువంటి చోట కూడా అండర్‌పాస్ బ్రిడ్జి లేదు. దీనిపై ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాలు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. డిజైన్ మార్చాలని లేదంటూ భవిష్యత్‌లో ఊహించని ప్రమాదాలు జరుగుతాయని చెబుతున్నారు. గ్రామాలకు వెళ్లే రోడ్లు అధికంగా ఉండటంతో రోడ్డు దాటే సమయంలో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అలాగే కొత్త రహదారి ప్రయాణానికి సౌకర్యవంతంగా ఉండటంతో కొందరు వాహనదారులు మితిమీరిన వేగంతో వెళ్తున్నారు. జాతీయ రహదారి అధికారులు స్పందించి రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.