
చిట్టి ఫ్రెండ్.. నేనున్నాగా..!
ఆనాడు.. రావణుడ్ని సంహరించేందుకు లంక పయనమైన శ్రీరాముడికి సాయంగా రామసేతు నిర్మాణానికి ఉడత సహకరించిందనే విషయం మనందరికీ తెలిసిందే. దీన్ని పుణికి పుచ్చుకొని తన సాయగుణాన్ని మరోసారి అది ప్రదర్శించింది. కలెక్టరేట్ సమీపంలో గల పార్కులో ఎండను తాళలేక ఓ ఉడత శనివారం స్పృహ కోల్పోయింది. దీంతో సమీపంలో ఉన్న మరో ఉడత వెంటనే స్పందించి కుక్కలు, గద్దల బారిన పడకుండా ఉండేందుకు దాన్ని నోటితో కరుచుకొని చెట్టెక్కింది. ఎవరైనా ఆపదలో ఉంటే మనకెందుకులే అంటూ పక్కకు వెళ్లిపోతున్న ఈ రోజుల్లో వీటిని చూసి ఎంతో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.
– సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరు

చిట్టి ఫ్రెండ్.. నేనున్నాగా..!

చిట్టి ఫ్రెండ్.. నేనున్నాగా..!

చిట్టి ఫ్రెండ్.. నేనున్నాగా..!