లైంగికదాడికి యత్నించిన కేసులో నిందితుడి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

లైంగికదాడికి యత్నించిన కేసులో నిందితుడి అరెస్ట్‌

Mar 20 2025 11:55 PM | Updated on Apr 1 2025 3:51 PM

వరికుంటపాడు: మండలంలోని వరికుంటపాడులో ఈనెల 16వ తేదీ అర్ధరాత్రి వృద్ధురాలిపై లైంగికదాడికి యత్నించిన కేసులో గొలపల్లి గురవయ్య అనే వ్యక్తిని గురువారం అరెస్ట్‌ చేశామని ఎస్సై రఘునాథ్‌ తెలిపారు. అతడిని ఉదయగిరి జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో హాజరుపరిచామన్నారు.

రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి

నెల్లూరు(క్రైమ్‌): రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన గురువారం జరిగింది. రైల్వే పోలీసుల కథనం మేరకు.. నెల్లూరులోని ఆత్మకూరు బస్టాండ్‌ సమీపంలోని పట్టాలపై గుర్తుతెలియని వ్యక్తిని రైలు ఢీకొనడంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి వయసు 40 నుంచి 45 సంవత్సరాల్లోపు ఉండొచ్చని భావిస్తున్నారు. ఆకుపచ్చ రంగు హాఫ్‌ హ్యాండ్‌ టీ షర్ట్‌, బులుగు రంగు షాట్‌ ధరించి ఉన్నాడు. రైల్వే ఎస్సై మాలకొండయ్య ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఉపాధి కోసం వచ్చి కానరాని లోకాలకు..

గుర్తుతెలియని వాహనం ఢీకొని మృతి

మనుబోలు: ఉపాధి కోసం వచ్చి గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన మండలంలోని మనుబోలు – పొదలకూరు రోడ్డు మార్గంలో రాజోలుపాడు వద్ద బుధవారం అర్ధరాత్రి జరిగింది. గురువారం పోలీ సులు వివరాలు వెల్లడించారు. హరియాణా రాష్ట్రానికి చెందిన బల్వీందర్‌ సింగ్‌ (30) వరికోత మెషీన్‌ ఆపరేటర్‌గా ఉన్నాడు. రాజోలుపాడు గ్రామ పొలాల్లో పనిలు చేస్తున్నాడు. సమీపంలోని పెట్రోలు బంక్‌ వద్ద ఉంటున్నాడు. బుధవారం అర్ధరాత్రి మూత్రవిసర్జన కోసం అతను రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతిచెందాడు. ఎస్సై శివరాకేష్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

24,289 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు

జాయింట్‌ కలెక్టర్‌ కార్తీక్‌

నెల్లూరు రూరల్‌: జిల్లాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 24,289 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు జేసీ కార్తీక్‌ తెలిపారు. గురువారం 3,582 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారని ప్రకటన విడుదల చేశారు. రూ.52.10 కోట్లను రైతులకు చెల్లించినట్లు వెల్లడించారు. రైతులు దళారుల మాటలు విని తక్కువ ధరకు అమ్ముకోవద్దని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement