
క్రీడల్లో శిక్షణ
సురేష్ నెల్లూరులోని కేఎన్‌ఆర్ పాఠశాలలో పదో తరగతి వరకు చదివాడు. అతడికి మొదటి నుంచి క్రీడలపై ఆసక్తి ఉంది. దీనిని గమనించిన పీఈటీ అజయ్‌కుమార్ శిక్షణ ఇచ్చి ప్రోత్సహించాడు. సురేష్ ఏసీ సుబ్బారెడ్డి స్టేడియానికి నిత్యం వెళ్లేవాడు. కోచ్‌లు అతడి ఆసక్తిని గమనించి అథ్లెటిక్స్‌లో శిక్షణ ఇచ్చారు. ఫుట్‌బాల్, కబడ్డీ, ఖోఖో, క్రికెట్, వాలీబాల్ ప్రావీణ్యం సంపాదించాడు. దివ్యాంగులకు నిర్వహించే అనేక క్రీడా పోటీల్లో పాల్గొని ప్రతిభ చూపాడు. 2018లో విశాఖపట్నంలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలు తదితర వాటిల్లో ప్రతిభ చూపాడు. 2021 వరకు క్రీడల్లో రాణించినా పలు కారణాలతో దూరం కావాల్సి వచ్చింది.