
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల జీవితాల
8 నెలల్లో రిజిస్టర్ అయిన అర్జీలు
32,754
ఆన్‌లైన్‌లో నమోదు కానివి
3 వేల పైమాటే
పరిష్కరించినట్లు చెబుతున్న అర్జీలు
28,913
పరిష్కారానికి నోచుకోని అర్జీలు
3,841
ప్రతి వారం వస్తున్న అర్జీల సంఖ్య
400 పైమాటే
నెల్లూరు (అర్బన్): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాసమస్యల పరిష్కార వేదిక.. ఒక ప్రహసన కార్యక్రమంగా మిగిలిపోతోంది. ప్రతి సోమవారం కలెక్టర్ నుంచి అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొంటున్న ఈ వేదిక సామాన్య ప్రజలకు పరిష్కారం చూపించి భరోసా కల్పించలేకపోతోంది. క్షేత్రస్థాయిలో ప్రజలు పడుతున్న ఇబ్బందులకు ప్రతి సోమవారం కలెక్టరేట్‌కు వచ్చే అర్జీలే నిదర్శనంగా ఉంది. ప్రతి వారం జిల్లా నలుమూలల నుంచి 400 నుంచి 450 అర్జీలు వస్తున్నాయంటే మండల కేంద్రాల్లో ఆయా శాఖల అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది. పేదలమైన తమ భూములను పెద్దలు గుంజుకుంటున్నారు. రైతులకు పాస్‌బుక్‌లు సకాలంలో ఇవ్వడం లేదు. రోడ్డు, బాటలను కబ్జా చేస్తున్నారు. శ్మశాన స్థలాలను ఆక్రమిస్తున్నారు. ఉన్న ఇంటి స్థలాన్ని కబ్జాచేయాలని చూస్తున్నారు.. అంటూ ఇలాంటి సమస్యలు మండల కేంద్రాల్లో పరిష్కారం కాకపోవడంతో ఎంతో ఆశతో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో సోమవారం జరిగే ప్రజాసమస్యల పరిష్కార వేదిక వద్దకు బాధితులు క్యూ కడుతున్నారు. కొన్ని చోట్ల ఆక్రమణదారులకు ప్రజాప్రతినిధులు అండగా నిలుస్తున్నారు. దీంతో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఫలితంగా బాధితులు కలెక్టరేట్ చుట్టూ, మండల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
మండలాల్లో పరిష్కారం కాలేదని కలెక్టరేట్‌కు వస్తే...
మండల కేంద్రాల్లో ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చినప్పటికీ తహసీల్దార్‌గాని, ఎంపీడీఓ గాని, ఇతర అధికారులు సమస్యలను పరిష్కరించకుండా తిప్పుకుంటున్నారు. దీంతో జిల్లా నలుమూలల నుంచి ఒక రోజు కూలీ వదులుకుని, ఛార్జీలు పెట్టుకుని, తినీ తినక కలెక్టరేట్‌కు వచ్చి అర్జీలు ఇస్తున్నారు. అయితే కలెక్టరేట్‌లో అర్జీలు తీసుకుని అధికారులు సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సమస్యను పరిష్కరించాలని ఆదేశిస్తున్నారు. మళ్లీ మండల కేంద్రాలకే అర్జీదారులను పంపుతున్నారు. ఇక సమస్య పరిష్కరించేసినట్టేనంటూ ఆన్‌లైన్‌లో అర్జీలను క్లోజ్ చేస్తున్నారు. వాస్తవానికి క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారం కావడం లేదు.
అర్జీదారుల సంఖ్య ఎందుకు తగ్గడం లేదు
అధికారులు చెబుతున్నట్లు సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ఉంటే ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో సుమారు 400 వరకు అర్జీదారులు ఎందుకు వస్తున్నారంటూ బాధితులు ఆవేదన చెందుతున్నారు. ఒకే సమస్యపై మళ్లీ మళ్లీ రావాల్సి వస్తుందని బాధ పడుతున్నారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన గ్రీవెన్స్‌ను పరిశీలించగా ఆన్‌లైన్ చేసిన అర్జీలు 303 రాగా, మరో 70కి పైగా ఆన్‌లైన్ కాకుండా అర్జీలు వచ్చాయి.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల జీవితాల