నెల్లూరు(క్రైమ్): ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తుతెలియని దుండగులు నగదు, బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. ఈ ఘటన బుజబుజనెల్లూరు ఆర్టీసీ కాలనీలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. ఆర్టీసీ కాలనీలో రాజ్‌కిశోర్‌రెడ్డి కుటుంబం నివాసం ఉంటోంది. అతను ఈనెల 14వ తేదీన తన కుటుంబంతో తిరుమలకు వెళ్లారు. శనివారం తెల్లవారుజామున గుర్తుతెలియని దుండగులు ఇంటి తలుపులు పగులగొట్టి బీరువాలో ఉన్న కొంత నగదు, సుమారు పది సవర్ల బంగారు ఆభరణాలు అపహరించారు. స్థాని కుల ద్వారా విషయం తెలుసుకున్న బాధి తులు నెల్లూరుకు చేరుకుని వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశారు.