నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదు | - | Sakshi
Sakshi News home page

నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదు

Mar 15 2025 12:09 AM | Updated on Mar 15 2025 12:09 AM

నాణ్య

నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదు

నాణ్యత లేని వస్తువులు ఇస్తున్నారు

ప్రొవిజన్స్‌ దుకాణాలు, మార్ట్‌లలో పప్పుదినుసులు, నూనె, ఇతర నిత్యావసర వస్తువుల్లో నిర్వాహకులు నాణ్యతా ప్రమాణాలను పాటించడం లేదు. తక్కువ నాణ్యత కల్గిన వస్తువులను విక్రయాలు చేస్తున్నారు. అధికారులు ఆయా వస్తువులను పరిశీలిస్తే వారి అవకతవకలు బయటపడుతాయి.

– రంజిత్‌, కిసాన్‌నగర్‌

మార్కెట్‌లో కూరగాయలు కొనుగోలు చేస్తే వినియోగదారుడు నష్టపోతున్నాడు. వినియోగదారులకు అవసరమైనవి ఏరుకునే పరిస్థితి లేదు. వ్యాపారులు ఇచ్చినవే తీసుకోవాల్సి వస్తుంది. కుళ్లినవి, వాడిపోయినవి కలిపి వినియోగదారులకు అంటగడుతున్నారు. అధికారులు తనిఖీలు నిర్వహించి వినియోగదారులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి. – వెంకటరెడ్డి, వినియోగదారుడు

వినియోగదారులుకు అండగా ఉంటాం

తూనికలు, కొలతల శాఖ వినియోగదారులకు అండగా ఉంటుంది. మార్కెట్‌లో ఎవరైనా వ్యాపారులు మోసం చేసినట్టు తెలిస్తే వెంటనే తమకు సమాచారమివ్వాలి. తక్షణమే తాము వచ్చి అలాంటి వారిమీద కేసులు నమోదు చేస్తాం. జిల్లాలో ఇప్పటి వరకు 290 మందిపై కేసులు నమోదు చేశాం. తూకాల్లో మోసం చేసేవారిపై భారీగా అపరాద రుసుం వసూలు చేస్తాం.

– ఐజాక్‌, కంట్రోలర్‌, తూనికలు, కొలతలశాఖ

నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదు 1
1/1

నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement