శనగల కొనుగోలుకు నేటి నుంచి రిజిస్ట్రేషన్లు | - | Sakshi
Sakshi News home page

శనగల కొనుగోలుకు నేటి నుంచి రిజిస్ట్రేషన్లు

Mar 11 2025 12:11 AM | Updated on Mar 11 2025 12:12 AM

ఉదయగిరి: జిల్లాలో శనగ పంట ఉత్పత్తులను ప్రభు త్వ మద్దతు ధరకు విక్రయించేందుకు రైతులు మంగళవారం నుంచి మార్చి 20వ తేదీ వరకు రైతు సేవా కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకోవాలని జేసీ కార్తీక్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 7వ తేదీన ‘శనగ రైతు.. దైన్యం’ శీర్షికతో సాక్షిలో కథనం ప్రచు రితమైన విషయం తెలిసిందే. అధికారులు స్పందించి రిజిస్ట్రేషన్‌ పక్రియ పూర్తయ్యాక రైతుల నుంచి మద్దతు ధర రూ.5,650కు కొనుగోలు చేస్తామని తెలిపారు.

కలెక్టరేట్‌ వద్ద

వీహెచ్‌పీ ధర్నా

నెల్లూరు రూరల్‌: అన్నమయ్య జిల్లా రాయచోటిలో వీరభద్రస్వామి ఆలయ పార్వేట ఉత్సవం సందర్భంగా భక్తుల ఊరేగింపుపై అన్యమతస్తుల దాడిని నిరసిస్తూ విశ్వహిందూ పరిషత్‌ నాయకులు సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌ ఆనంద్‌కు వినతిపత్రం సమర్పించారు. ప్రశాంతంగా ఉత్సవా న్ని నిర్వహించుకునే హిందువులపై అన్యమతస్తులు దాడి చేస్తే.. అందుకు హిందూ సంస్థలను బాధ్యుల్ని చేస్తూ కేసులు పెట్టడం దారుణ మన్నారు. హిందువులను, ఆ సంస్థలను కించపరిచే విధంగా పోలీసులు ప్రవర్తించడం, దేశభక్త సంస్థలైన ఆర్‌ఎస్‌ఎస్‌, వీహెచ్‌పీలపై కేసు పెట్ట డాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.

నాగులవెల్లటూరు

చెరువుకు గండి

చేజర్ల: మండలంలోని నాగులవెల్లటూరు గ్రామ చెరువుకు సోమవారం గండి పడింది. సోమశిల దక్షిణ కాలువ నీటితో చెరువు నిండి కట్ట తెగింది. సమాచారం అందుకున్న సోమశిల ప్రాజెక్ట్‌ చైర్మన్‌ వేలూరు కేశవచౌదరి సోమవారం సాయంత్రం చెరువు దగ్గరకు చేరుకుని పరిశీలించారు. సోమశిల దక్షిణ కాలువ 5ఎన్‌ నుంచి విడుదలయ్యే నీటిని తాత్కాలికంగా నిలుపుదల చేయాలని అధికారులను ఆదేశించారు. నీటి ప్రవాహం తగ్గిన వెంటనే మరమ్మతులు చేపడతామని, రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణరెడ్డి నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తూ చర్యలు తీసుకుంటున్నారని ఆయన తెలిపారు. అయితే ఇరిగేషన్‌ అధికారులతో ఈ విషయమై మాట్లాడేందుకు ఫోన్‌ ద్వారా సంప్రదించగా సరిగా స్పందించలేదు.

వాడింది 5 యూనిట్లు..

వచ్చిన బిల్లు రూ.945

నెల్లూరు(వీఆర్సీసెంటర్‌): ఓ వినియోగదారుడు తన దుకాణానికి నెలరోజులపాటు తాళం వేసి ఒక జీరో బల్బు వేసి ఉంచితే నెలకు అయిన విద్యుత్‌ వినియోగం 5 యూనిట్లు మాత్రమే. అయితే వచ్చిన బిల్లు మాత్రం రూ.945. నెల్లూరు నగరానికి చెందిన న్యాయవాది బసిరెడ్డి నారాయణరెడ్డికి రామ్మూర్తినగర్‌ విద్యుత్‌ సెక్షన్‌ పరిధిలో ఓ దుకాణం ఉంది. 3321214186941 నంబరుతో విద్యుత్‌ సర్వీస్‌ కనెక్షన్‌ ఉంది. దీనిని బాడుగకు తీసుకున్నవారు గత నెల ఖాళీ చేశారు. అందులో ఒక జీరో బల్బు మాత్రమే వేసి ఉండటంతో ఫిబ్రవరి నెల మొత్తానికి 5 యూనిట్లు విద్యుత్‌ మాత్రమే ఖర్చు అయ్యింది. దీనికి చెల్లించాల్సింది రూ.65 మాత్రమే. కానీ బిల్లులో వివిధ చార్జీలతో కలిపి మొత్తం రూ.945 బిల్లు వచ్చింది.

శనగల కొనుగోలుకు   నేటి నుంచి రిజిస్ట్రేషన్లు
1
1/3

శనగల కొనుగోలుకు నేటి నుంచి రిజిస్ట్రేషన్లు

శనగల కొనుగోలుకు   నేటి నుంచి రిజిస్ట్రేషన్లు
2
2/3

శనగల కొనుగోలుకు నేటి నుంచి రిజిస్ట్రేషన్లు

శనగల కొనుగోలుకు   నేటి నుంచి రిజిస్ట్రేషన్లు
3
3/3

శనగల కొనుగోలుకు నేటి నుంచి రిజిస్ట్రేషన్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement