ఆత్మకూరు: షుగర్ వ్యాధిగ్రస్తులకు అందజేసే ఇన్సులిన్ వైల్స్ రెండు రకాలను ప్రభుత్వం సరఫరా చేసింది. సోమవారం ఉదయం నాటికి అన్ని పీహెచ్‌సీలకు జిల్లా సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి సరఫరా అయ్యాయి. గత నెల 20వ తేదీన సాక్షిలో ‘ఇన్సులిన్‌కూ కటకటే’ అనే శీర్షికతో కథనం వచ్చిన విషయం తెలిసిందే. ప్రభుత్వం కేరళ రాష్ట్రం నుంచి ఇన్సులిన్‌ను తెప్పించింది. 70 శాతం అందుబాటులోకి వచ్చిందని సిబ్బంది పేర్కొన్నారు.
మద్యం మత్తులో వీరంగం సృష్టిస్తూ..
సోమశిల: మండల కేంద్రమైన అనంతసాగరం గ్రామానికి చెందిన ఓ యువకుడు మద్యం మత్తులో వీరంగం సృష్టిస్తూ చోరీలకు పాల్పడుతుండటంతో సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై సూర్యప్రకాష్‌రెడ్డి కథనం మేరకు.. ఎస్సీ కాలనీకి చెందిన పెనగలూరి రాజేంద్ర (బళ్లారి) గతంలో ఐస్ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. ఇతడికి మద్యం అలవాటు ఉంది. డబ్బుల్లేనప్పుడు వృద్ధులు, ఒంటరిగా వెళ్తున్న వారిపై దాడి చేసి నగదు, సెల్‌ఫోన్లు లాక్కొని పరారవుతుంటాడు. దుకాణాల్లో సామగ్రి, ఇళ్ల ముందు ఉండే బైక్‌లు, సైకిళ్ల తీసుకెళ్లి విక్రయించి మద్యం తాగుతుంటాడు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. శనివారం రాత్రి పాతదేవరాయపల్లి దర్గాలో జరిగిన చోరీకి ఇతడే బాధ్యుడని తెలిసింది. ఇంకా ఓ ఇంట్లో వస్తువులు, బైక్ చోరీ చేశాడని గుర్తించారు. రాజేంద్రపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామని ఎస్సై తెలిపారు.
పీహెచ్‌సీలకు చేరిన ఇన్సులిన్ వైల్స్