
ఏకపక్షంగా ఆ సంస్థ వైఖరి
హైదరాబాద్
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ దుర్మార్గ వైఖరి.. వరి రైతులకు శరాఘాతంగా మారింది. కృష్ణపట్నం పోర్టు నుంచి హైదరాబాద్ వరకు బీపీసీఎల్ సంస్థ ఆయిల్ సరఫరాకు పైప్‌లైన్ నిర్మిస్తోంది. పచ్చని పంటలను ధ్వంసం చేసి తమ పైప్‌లైన్ ఏర్పాటు చేయడానికి దుందుడుకుతనంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే ఈ సంస్థ తీరుపై పైప్‌లైన్ వెళ్లే మార్గంలోని రైతులు కస్సుబుస్సులాడుతున్నారు. ఈ సమస్యపై రైతు సంఘాలు, వామపక్ష పార్టీలు సైతం కలెక్టర్‌ను కలిసి పంట కాలం పూర్తయ్యే వరకు ఈ పనులు నిలిపివేయాలని విజ్ఞప్తి చేశాయి. రైతులకు జరిగే నష్టాన్ని అంచనా వేయకుండా బీపీసీఎల్ ఏకపక్షంగా వ్యవహరిస్తుంటే ఇందుకు పోలీసులు, అధికారులు వత్తాసు పలకడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
పచ్చటి పొలాల వద్దకు చేరిన
పైప్‌లైన్
కావలి: వ్యవసాయ భూముల్లో బీపీసీఎల్ సంస్థ ఏర్పాటు చేస్తున్న పైప్‌లైన్ పల్లెల్లో రగడ సృష్టిస్తోంది. పంట చివరి దశలో ఉండగా ఆ భూములను ధ్వంసం చేసి పైప్‌లైన్ వేయడాన్ని రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయా భూముల్లో వరి పంట సాగులో ఉంది. కనీసం 20 రోజులు సమయం ఇస్తే పంట కోత పూర్తవుతుందని నచ్చ జెప్పినా బీపీసీఎల్ సిబ్బంది ఖాతరు చేయడం లేదు. మండలంలోని సర్వాయపాళెం, ఆనెమడుగు పంచాయతీల పరిధిలో పలు గ్రామాల మీదుగా ఈ నెల 11వ తేదీ నుంచి వరి సాగులో ఉన్న భూముల్లో పైప్‌లైన్ వేసి తీరుతామని బీపీసీఎల్ ప్రతినిధులు మంకుపట్టు పడుతున్నారు. మా భూముల్లో మాకు తెలియకుండా దౌర్జన్యంగా పైప్‌లైన్ వేయడమేంటని రైతులు ఆగ్రహిస్తున్నారు. వరి పైరు పాడైపోతే నష్ట పరిహారం ఇస్తామని బీపీసీఎల్ సిబ్బంది చులకన భావంతో చెబుతున్న మాటలు రైతుల్లో ఆగ్రహం రగిలిస్తోంది. గ్రామాల్లో పోలీసులు పహారా నడుమ పొలాల్లో పైప్‌లైన్ వేయడానికి అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న తీరుపై రైతులు కలత చెందుతున్నారు. సన్నకారు రైతులు భూముల్లో నడి మధ్యన పైప్‌లైన్ వేసి పొలాలను ధ్వంసం చేసి రైతుల జీవనాధారం కోల్పోయే దుర్మార్గమైన వాతావరణాన్ని అధికారులు సృష్టిస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు.
నిర్మాణం ఎలాగంటే..
పైపులైన్ వేసేందుకు రూ.451 కి.మీ. పొడవునా 16 మీటర్ల వెడల్పున భూమిని స్వాధీనం చేసుకుంటారు. అందులో రెండు మీటర్ల వెడల్పులో ఆరు అడుగుల లోతు తవ్వుతారు. పైపులైన్‌కు ఒక వైపున మూడు మీటర్లు, మరో వైపు 11 మీటర్ల మేర ఖాళీ ఉంచుతారు. లైన్ కోసం తవ్విన మట్టిని ఒక వైపు పోసి, మెటీరియల్‌ను మరో వైపు నుంచి తీసుకెళ్తారు. 16 అంగుళాల పైపు వేసి తిరిగి ఆ మట్టిని పూడ్చేస్తారు. అనంతరం ఆ భూమిని రైతులకు అప్పగిస్తారు. ప్రతి 10 కి.మీ.కు ఒక చోట చెకింగ్ పాయింట్‌తో పాటు లైన్ పొడవునా సెన్సార్‌లు ఏర్పాటు చేయనున్నారు. పనులు పూర్తయిన తర్వాత రైతులు ఎప్పటిలా పంటలు సాగు చేసుకోవచ్చు. అయితే సాధారణ వ్యవసాయ పంటలు తప్ప వేర్లు బాగా లోపలికి వెళ్లి పైపును డ్యామేజీ చేసే మామిడి, జామాయిల్ వంటివి సాగు చేసే అవకాశం లేదు. పైపులైన్ నిర్మాణం తర్వాత ఆ ప్రాంతంలో పంటలు వేసుకోవచ్చు. అయితే పైపులైన్‌న్‌దెబ్బతినే స్థాయిలో పెద్దపెద్ద వృక్షాలు పెంచకూడదు.
పొలాల్లో చివరి దశలో వరి పైరు
ఈ నెల 11 నుంచి పైప్‌లైన్
ఏర్పాటుకు యత్నాలు
పంట దెబ్బతింటే సహించమంటున్న రైతులు

ఏకపక్షంగా ఆ సంస్థ వైఖరి

ఏకపక్షంగా ఆ సంస్థ వైఖరి