
No Headline
ఈ చిత్రంలో రక్తదానం చేస్తున్న వ్యక్తి పేరు మదనపల్లి మధుసూదన్‌రావు. ఓ పాజిటివ్ గ్రూపు రక్తాన్ని కలిగి ఉన్నారు. ఈయన బ్లడ్‌బ్యాంకులో మోటివేటర్‌గా పని చేస్తున్నారు. నిత్యం విద్యార్థులను, ప్రజలను, స్వచ్ఛంద సంస్థలను చైతన్యం చేస్తూ బ్లడ్ క్యాంపులు నిర్వహణలో కీలకపాత్ర పోషిస్తున్నారు. స్వచ్ఛంద రక్తదానాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఎప్పుడు రక్తం అవసరం అనిపించినా.. తానున్నానంటూ అత్యధికంగా 133 సార్లు దానం చేశారు. అనేక అవార్డులు అందుకున్నారు. రాష్ట్రంలోనే అత్యధిక సార్లు రక్తం దానం చేసి స్ఫూర్తిగా నిలిచారు.