
అలంకారప్రాయంగా..
నెల్లూరు(అర్బన్): నెల్లూరు సంతపేటలోని జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో లిఫ్ట్ పని చేయడం లేదు. మూడు అంతస్తుల డీఎంహెచ్‌ఓ భవనం నిర్మించే సమయంలో లిఫ్ట్‌ను ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. అయితే ఏ కారణం చేతనో ఆ పనులు పూర్తి కాలేదు. గత డీఎంహెచ్‌ఓ రాజ్యలక్ష్మి లిఫ్ట్ పనులు పూర్తి చేయించి వినియోగంలోకి తెచ్చారు. ఇందుకోసం రూ.లక్షలు వెచ్చించారు. సుమారు ఎనిమిది నెలల నుంచి లిఫ్ట్ పని చేయ డం లేదు. మరమ్మతులకు గురైంది. జిల్లా నలు మూలల నుంచి పెన్షనర్లు, వయసు మళ్లిన ఉద్యోగులు డీఎంహెచ్‌ఓ కార్యాలయానికి పనుల నిమి త్తం వస్తుంటారు. అంతేకాకుండా బెడ్‌రిడన్ (మంచంపై నుంచి లేవలేని) రోగులకు వంద శాతం పింఛన్ రావాలంటే అలాంటి వారి కోసం డీఎంహెచ్‌ఓ సంతకం చేయాల్సి ఉంటుంది. ఇలా పలు రకాల వ్యక్తులు ఈ కార్యాలయానికి వస్తారు. వీరు మెట్లు ఎక్కలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి లిఫ్ట్‌కు మరమ్మతులు చేయించి వినియోగంలోకి తీసుకురావాలని సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై డీఎంహెచ్‌ఓ పెంచలయ్యను వివరణ కోరగా త్వరలోనే మరమ్మతులు చేయిస్తామన్నారు.