రెండు యూనిట్లలో విద్యుదుత్పత్తి | - | Sakshi
Sakshi News home page

రెండు యూనిట్లలో విద్యుదుత్పత్తి

Oct 1 2023 12:24 AM | Updated on Oct 1 2023 12:24 AM

శ్రీదామోదరం సంజీవయ్య ఏపీజెన్‌కో ప్రాజెక్ట్‌  - Sakshi

శ్రీదామోదరం సంజీవయ్య ఏపీజెన్‌కో ప్రాజెక్ట్‌

ముత్తుకూరు: మండలంలోని నేలటూరులో ఉన్న శ్రీదామోదరం సంజీవయ్య ఏపీజెన్‌కో ప్రాజెక్ట్‌లోని రెండు యూనిట్లలో విద్యుదుత్పత్తి జరుగుతోందని ప్రాజెక్ట్‌ ఇంజినీర్లు శనివారం తెలిపారు. ఇందులో భాగంగా 1వ యూనిట్‌లో 420 మెగావాట్లు, 2వ యూనిట్‌లో 380 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతోంది. సాంకేతిక కారణాల వల్ల 3వ యూనిట్‌లో ఉత్పత్తి నిలిపివేసినట్లు వారు తెలిపారు.

3 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌

నెల్లూరు(టౌన్‌): జిల్లాలో ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం నిర్వహిస్తున్న భవిత కేంద్రాల్లో కాంట్రాక్ట్‌ పద్ధతిన సహిత విద్య రిసోర్స్‌పర్సన్ల నియామకం కోసం ఈ నెల 3 నుంచి 5వ తేదీ వరకు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ నిర్వహిస్తున్నట్లు సమగ్రశిక్ష ఏపీసీ ఉషారాణి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు వచ్చే అభ్యర్థులు 10వ తరగతి, ఇంటర్‌, డిగ్రీ స్పెషల్‌ బీఈడీ/డీఈడీ, కుల, ఆర్‌సీఐ ఒరిజనల్‌ సర్టిఫికెట్లతోపాటు గెజిటెడ్‌ అధికారులు ధ్రువీకరించిన రెండు సెట్లు జెరాక్స్‌ కాపీలు, రెండు పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలు తీసుకురావాలని తెలిపారు. నెల్లూరులోని సమగ్రశిక్ష కార్యాలయంలో సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ ఉంటుందని తెలిపారు.

రేపటి స్పందన రద్దు

నెల్లూరు(క్రైమ్‌): ఈ నెల 2వ తేదీ గాంధీ జయంతి సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో స్పందన కార్యక్రమం రద్దు చేసినట్లు ఎస్పీ డాక్టర్‌ కె.తిరుమలేశ్వరరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

3.19 లక్షల మందికి వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక

నేటి నుంచి లబ్ధిదారులకు పంపిణీ

నెల్లూరు(పొగతోట): వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పంపిణీ ప్రక్రియకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 1వ తేదీ ఉదయం నుంచి వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక నగదును పంపిణీ చేయనున్నారు. జిల్లావ్యాప్తంగా 3,19,979 మంది లబ్ధిదారులకు రూ.88.93 కోట్ల నగదును పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేశారు. వలంటీర్లు లబ్ధిదారులకు ఇంటికే వెళ్లి పింఛన్‌ నగదు పంపిణీ చేస్తారు. ఈ నెల 5వ తేదీ వరకు కార్యక్రమం కొనసాగుతుంది.

కళాకారుల గుర్తింపు కార్డు కోసం దరఖాస్తుల ఆహ్వానం

నెల్లూరు(దర్గామిట్ట): జిల్లాలో కళాకారుల గుర్తింపు కార్డులు కావాల్సిన కళాకారులు ఈ నెల 7వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సమాచార పౌరసంబంధాల అధికారి కె.సదారావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కళాకారుల గుర్తింపు కార్డులు జారీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సాంస్కృతికశాఖ నిర్ణయించిందని, జిల్లాలో వివిధ కళారంగాల్లో ఉన్న కళాకారులు గుర్తింపు కార్డు కోసం నిర్ణీత దరఖాస్తులో జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి, కలెక్టర్‌ కాంపౌండ్‌, నెల్లూరు వారికి పూర్తి చేసిన దరఖాస్తును పంపాలని పేర్కొన్నారు. దరఖాస్తు కోసం 9618432664 ఫోన్‌నంబర్‌లో కార్యాలయ వేళల్లో సంప్రదించాలని తెలిపారు.

ఏపీఆర్‌ఏ రాష్ట్ర

ఉపాధ్యక్షుడిగా అల్లంపాటి

నెల్లూరు(దర్గామిట్ట): ఆంధ్రప్రదేశ్‌ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా అల్లంపాటి పెంచలరెడ్డి ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. అక్టోబర్‌ 2వ తేదీతో ప్రస్తుత ఏపీఆర్‌ఏ రాష్ట్ర కార్యవర్గం పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలు నిర్వహించారు. ఈయన అక్టోబర్‌ 1వ తేదీన విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement