Yuxvendra Chahal: టి20 క్రికెట్‌లో చహల్‌ అరుదైన ఫీట్‌

Yuzvendra Chahal Bags 250th Wicket In T20 Cricket 4th Indian Cricketer - Sakshi

రాజస్తాన్‌ రాయల్స్‌ బౌలర్‌ యజ్వేంద్ర చహల్‌ టి20 క్రికెట్‌లో అరుదైన ఫీట్‌ సాధించాడు. ఐపీఎల్‌ 2022లో భాగంగా రాజస్తాన్‌ రాయల్స్‌.. ఎస్‌ఆర్‌హెచ్‌తో తొలి మ్యాచ్‌ ఆడింది. ఈ మ్యాచ్‌లో చహల్‌ 4 ఓవర్లు వేసి 22 పరుగులిచ్చి మూడు  కీలక వికెట్లు తీశాడు. ఈ నేపథ్యంలో టి20 క్రికెట్‌లో(అంతర్జాతీయ, లీగ్‌లు) కలిపి చహల్‌ 250 వికెట్ల మార్క్‌ను సాధించాడు. ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటర్‌ షెపర్డ్‌ను ఔట్‌ చేయడం ద్వారా చహల్‌ ఈ ఫీట్‌ను సాధించాడు. టీమిండియా నుంచి టి20ల్లో 250 వికెట్ల మార్క్‌ను అందుకున్న నాలుగో బౌలర్‌గా నిలిచాడు. ఇంతకముందు పియూష్‌ చావ్లా(262 వికెట్లు), అమిత్‌ మిశ్రా(260 వికెట్లు),  రవిచం‍ద్రన్‌ అశ్విన్‌(264 వికెట్లు) ఉన్నారు. 

ఇక ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ ఘన విజయం సాధించింది. 211 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్‌ఆర్‌హెచ్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 149 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఎయిడెన్‌ మార్ర్కమ్‌ 57 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. వాషింగ్టన్‌ సుందర్‌ 40 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. రాజస్తాన్‌ రాయల్స్‌ బౌలర్లలో చహల్‌ 3, బౌల్ట్‌, ప్రసిధ్‌ కృష్ణ  చెరో రెండు వికెట్లు తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్తాన్‌ రాయల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. కెప్టెన్‌ సంజూ శాంసన్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌(27 బంతుల్లో 55) కు తోడు చివర్లో హెట్‌మైర్‌(13 బంతుల్లో 32) మెరుపులు మెరిపించగా.. బట్లర్‌ 35, పడిక్కల్‌ 41 కీలకపాత్ర పోషించారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top