లైంగిక ఆరోపణలు.. స్టార్‌ ప్లేయర్‌పై వేటు వేసిన ఆర్సీబీ!? | Yash Dayal Missing From RCB Training, Absence Triggers Speculations | Sakshi
Sakshi News home page

IPL 2026: లైంగిక ఆరోపణలు.. స్టార్‌ ప్లేయర్‌పై వేటు వేసిన ఆర్సీబీ!?

Mar 21 2026 9:17 AM | Updated on Mar 21 2026 10:45 AM

Yash Dayal Missing From RCB Training, Absence Triggers Speculations

ఐపీఎల్‌-2026 సీజ‌న్‌కు రాయ‌ల్ ఛాలెంజెర్స్ బెంగ‌ళూరు స్టార్ పేస‌ర్ యశ్ ద‌యాల్ దూరం కానున్న‌ట్లు తెలుస్తోంది. ఓ బాలిక‌ను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలను ఎదుర్కొంటున్న ద‌యాల్‌ను ఆర్సీబీ మేనెజ్‌మెంట్ ప‌క్క‌న పెట్టిన‌ట్లు స‌మాచారం. బెంగ‌ళూరు జ‌ట్టు ప్ర‌స్తుతం చిన్న‌స్వామి స్టేడియంలో ట్రైనింగ్‌ క్యాంప్‌ను ఏర్పాటు చేసింది.

అయితే ఈ శిక్ష‌ణా శిబిరానికి ద‌యాల్  గైర్హాజరు కావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అంతేకాకుండా ఆర్సీబీ టీమ్ బస్‌పై కూడా ద‌యాల్ ఫోటో లేదు. దీంతో అత‌డిని జ‌ట్టు నుంచి త‌ప్పించారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విష‌యంపై ఆర్సీబీ నుంచి మాత్రం ఎటువంటి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌లేదు. 

ఆర్సీబీ తొలి టైటిల్ సాధించ‌డంలో ద‌యాల్‌ది కీల‌క పాత్ర‌. మొత్తం 13 వికెట్లు ప‌డ‌గొట్టి స‌త్తా చాటాడు. అయితే గ‌తేడాది జూలైలో ద‌యాల్‌పై రెండు వేర్వేరు రాష్ట్రాల్లో లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి. అందులో ఒక‌రు మైన‌ర్ కావ‌డంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. 

అయితే ఈ కేసులో అతడిని అరెస్టు చేయొద్దంటూ అల‌హాబాద్ హైకోర్టు స్టే ఇచ్చింది. అయితే రాజస్తాన్‌లో నమోదైన కేసులో మాత్రం అతడు బెయిల్‌పై ఉన్నాడు. రాజస్థాన్ హైకోర్టు యశ్ దయాల్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇక ఇది ఇలా ఉండగా.. గత నెలలో యశ్ దయాల్ సీక్రెట్‌గా పెళ్లిచేసుకున్నాడు. ప్రముఖ కంటెంట్ క్రియేటర్ శ్వేతా పుండీర్‌తో కలిసి ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టాడు.
చదవండి: IPL 2026: దుమ్ములేపిన ప‌ప్పు యాద‌వ్ కొడుకు.. కేవలం 16 బంతుల్లోనే

Advertisement
 
Advertisement
Advertisement