WTC India Schedule: ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్‌.. 30 ఏళ్ల తర్వాత తొలిసారిగా! భారత్‌ షెడ్యూల్‌!

World Test Championship: India Schedule For WTC 2023 2025 And 2025 2027 - Sakshi

World Test Championship 2023 -2025 And 2025 -2027: పురుషుల క్రికెట్‌కు సంబంధించిన 2023-27 ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్ షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) బుధవారం ప్రకటించింది. ఫ్యూచర్‌ టూర్‌ ప్రోగ్రామ్‌లో రెండు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ ఎడిషన్‌లు జరగన్నాయి.

టెస్టు ఛాంపియన్‌ షిప్‌ (2023-25, 2025-27) కాలానికి గానూ జరగనుంది. ఇక టీమిండియా విషయానికి వస్తే.. డబ్ల్యూటీసీ(2023-25,25-27)లో 38 టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది.  ప్రపంచటెస్టు ఛాంపియన్‌ షిప్‌లో భారత్‌ షెడ్యూల్‌ను ఓసారి పరిశీలిద్దాం.

2023-25 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ షెడ్యూల్‌
2023-25 డబ్ల్యూటీసీ సైకిల్‌లో భాగంగా స్వదేశంలో భారత్‌.. న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌, బంగ్లాదేశ్‌తో తలపడనుంది. అదే విధంగా విదేశాల్లో ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌, దక్షిణాఫ్రికాతో ఆడనుంది.

2025-27లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా షెడ్యూల్‌
2025-27 డబ్ల్యూటీసీ సైకిల్‌లో భాగంగా స్వదేశంలో టీమిండియా‌.. ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌, దక్షిణాఫ్రికాను ఢీకొట్టనుంది  ఇక విదేశాల్లో న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌, శ్రీలంకతో  భారత్‌ ఆడనుంది.

30 ఏళ్ల తర్వాత ఆసీస్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌
ప్రపంచటెస్టు ఛాంపియన్‌ షిప్‌( 2023-25, 2025-27)లో భాగంగా ఆస్టేలియాతో రెండు సార్లు ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత్‌ తలపడనుంది. కాగా కాగా 1992 తర్వాత ఇరు జట్లు ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ జరగనుండడం ఇదే తొలిసారి. 1992 నుంచి ఆసీస్‌-భారత జట్లు మధ్య మూడు లేదా నాలుగు టెస్టుల సిరీస్‌లు మాత్రమే జరగుతున్నాయి.

చదవండి: Mens FTP: ఎఫ్‌టీపీ ప్రకటించిన ఐసీసీ.. నాలుగేళ్లలో 777 అంతర్జాతీయ మ్యాచ్‌లు!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top