Virat Kohli-Anushka Sharma: మా రెస్టారెంట్‌లో మీరిద్దరు.. చాలా సంతోషం.. ఫొటో వైరల్

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి- బాలీవుడ్ నటి అనుష్క శర్మ దంపతులు లండన్‌లో సెలవులు ఆస్వాదిస్తున్నారు. ముద్దుల కుమార్తె వామికతో కలిసి హాలిడే ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో వారు లండన్‌లోని మేఫేర్‌లో ఉన్న బాంబే బసిల్ అనే ఇండియన్ రెస్టారెంట్‌కు వెళ్లారు.
కాగా సెలబ్రిటీ దంపతులు తమ రెస్టారెంట్‌కు రావడంతో చెఫ్ సురేందర్ మోహన్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. కోహ్లి- అనుష్కతో దిగిన ఫొటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి తన ఆనందాన్ని పంచుకున్నారు.
Happy & honoured to have had the wonderfully warm and pride of India @imVkohli and @AnushkaSharma dine with us @BombayBustle
😊🙏🏻🇮🇳#IndianCricketTeam #bollywoodactress #india #indianfood #bestindianrestaurant #london #mayfair #india pic.twitter.com/FNGOATaEbg— Surender Mohan (@SurenderChef) July 25, 2022
ఈ మేరకు.. ‘‘భారత దేశానికి గర్వకారణమైన విరాట్ కోహ్లి, అనుష్క శర్మ మాతో పాటు ఇలా కలిసి ఉండటం.. మా బాంబే బసిల్‌కు రావడం పట్ల ఎంతో సంతోషంగా ఉంది. ఇది మాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాం’’ అని ఆయన పేర్కొన్నారు. కాగా ఇంగ్లండ్‌తో సిరీస్‌లో పేలవ ప్రదర్శన కనబరిచిన కోహ్లి.. వెస్టిండీస్ టూర్‌కు వెళ్లలేదన్న సంగతి తెలిసిందే.
కొన్నాళ్ల పాటు విశ్రాంతి తీసుకోనున్న కోహ్లి.. భార్య అనుష్క, కూతురు వామికకు సమయాన్ని కేటాయించాడు. ఈ క్రమంలో అనుష్క షూటింగ్ కోసం పారిస్‌కు చేరుకున్న వీళ్లు తిరిగి లండన్‌కు వచ్చినట్లు తెలుస్తోంది. కోహ్లి తల్లి సరోజ్ కోహ్లి కూడా అక్కడికి వెళ్లినట్లు సమాచారం.
చదవండి: Virat Kohli - Robin Uthappa: జట్టులో కోహ్లి స్థానం గురించి ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు!
ఇదిలా ఉండగా.. ఇంగ్లండ్ గడ్డ మీద వన్డే, టీ20 సిరీస్‌లు గెలిచిన టీమిండియా ప్రస్తుతం విండీస్ పర్యటనలో ఉంది. ఇప్పటికే వన్డే సిరీస్‌ను 2-0తేడాతో సొంతం చేసుకుంది. బుధవారం(జూలై 27) నాటి ఆఖరి వన్డే ముగించుకున్న తర్వాత.. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది.
చదవండి: WC 2023: అందుకే గబ్బర్ కెప్టెన్ అయ్యాడు! రోహిత్ శర్మ కోరుకుంటున్నది అదే!
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు