
టోక్యో: భారత స్టార్ షెట్లర్ పీవీ సింధు ఒలింపిక్స్‌లో తన హవా కొనసాగిస్తూ స్వర్ణం పతకంపై గురి పెట్టింది. గ్రూఫ్ జెలో రెండు విజయాలతో టాపర్‌గా నిలిచిన పీవీ సింధు ప్రీ క్వార్టర్స్‌లోనూ తన దూకుడు కనబరిచి క్వార్టర్స్‌కు ప్రవేశించింది. గురువారం ఉదయం డెన్మార్క్ షెట్లర్ మియా బ్లిక్‌ఫెల్ట్‌తో జరిగిన ప్రీక్వార్టర్స్‌లో వరుస గేమ్‌లలో 21-15, 21-13తో చిత్తుచేసింది. మొత్తం 41 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో తొలి గేమ్‌ను 21-15తో 22 నిమిషాల్లోనే కైవసం చేసుకున్న సింధు రెండో గేమ్‌ను 21-19తో 19 నిమిషాల్లోనే ముగించి ఘన విజయాన్ని అందుకుంది. కాగా ఈ మ్యాచ్ విజయంతో గ్రూఫ్, ప్రీక్వార్టర్ష్‌లో మూడు విజయాలు సాధించిన సింధు క్వార్టర్స్‌లో అకానే యమగుచితో తలపడే అవకాశం ఉంది.