Tesla CEO Elon Musk Gives Clarity On Buying FootBall Club Manchester United - Sakshi
Sakshi News home page

Elon Musk: 'ఏ జట్టును కొనడం లేదు'.. ఆడుకోవడానికి మేమే దొరికామా!

Aug 17 2022 5:33 PM | Updated on Aug 17 2022 7:27 PM

Tesla CEO Elon Musk Clarifies Not Buying Any FootBall Team Another Tweet - Sakshi

టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ ఏది చేసినా సంచలనమే. వ్యాపార రంగంలో దూకుడుగా కనిపించే మస్క్‌.. తాజాగా బుధవారం ఉదయం ఒక ట్వీట్‌లో సంచలన ప్రకటన చేశాడు. ఇంగ్లీష్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఈపీఎల్‌)లో అత్యంత ప్రజాధరణ కలిగిన మాంచెస్టర్‌ యునైటెడ్‌ను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించాడు. ఎలాన్‌ మస్క్‌ ఫుట్‌బాల్‌ టీంను కొనుగోలు చేస్తున్నాడన్న దానిపై సోషల్‌ మీడియాలో విభిన్న వాదనలు వచ్చాయి.

కొందరు మస్క్‌ను ట్రోల్‌ చేయగా.. మరికొందరు మాత్రం మస్క్ రాకతో మాంచెస్టర్ యూనైటెడ్ జట్టు రూపురేఖలు మారతాయని పేర్కొన్నారు. ఇలా ఒక్క ట్వీట్‌తో ప్రపంచం మొత్తం తన గురించి మాట్లాడుకునేలా చేసిన ఎలాన్‌ మస్క్‌..  మూడు గంటల తర్వాత తాను ఎలాంటి జట్టును కొనుగోలు చేయడం లేదంటూ మరో ట్వీట్‌తో చావు కబురు చల్లగా చెప్పాడు. 

టెస్లా ఓనర్స్ సిలికాన్ వ్యాలీ.. తమ సీఈవో ఎలాన్ మస్క్ ను ఇదే విషయమై అడిగారు. ''మీరు చెబుతున్నది నిజమేనా..?''అని  ప్రశ్నించారు.  అప్పుడు మస్క్.. ''లేదు. అది (మస్క్ మాంచెస్టర్ జట్టును కొనుగోలు చేస్తున్నాడని) ట్విటర్ లో చాలా కాలంగా జోక్ ప్రచారంలో ఉంది. నేను  ఏ జట్టును కొనుగోలు చేయడం లేదు'' అని పేర్కొన్నాడు. మస్క్ స్పష్టతనిచ్చాక కూడా ట్విటర్ లో అతడిపై మీమ్స్ వర్షం కురుస్తూనే ఉంది. ''ఆడుకోవడానికి నీకు మేమే దొరికామా'' అంటూ ఘాటైన విమర్శలు చేశారు.

చదవండి: ఎలాన్‌ మస్క్‌ మరో సంచలనం! ఫుట్‌బాల్‌ టీమ్‌ను కొంటున్నా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement