నిన్ను చూస్తే గర్వంగా ఉందిరా : రైనా

Suresh Raina Shares His Son Photo Through Twitter Became Viral - Sakshi

దుబాయ్‌ : చిన్నపిల్లలు ఏం చేసినా చూడముచ్చటగా ఉంటుంది. ఇక చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఆ సందడే వేరుగా ఉంటుంది. వాళ్లు చేసే అల్లరి తల్లిదండ్రులకు ఎంతో మురిపెంగా ఉంటుంది. వాళ్ల సందడితో తమకున్న కష్టాలను మరిచి వారితో సంతోషంగా గడుపుతారు. ఇప్పుడు అలాంటి సంతోష క్షణాలు తనకు ఉన్నాయని భారత మాజీ క్రికెటర్‌ సురేశ్‌ రైనా అంటున్నాడు. తాజాగా రైనా తన కొడుకు రియో ఫోటోను ట్విటర్లో షేర్‌ చేశాడు. ఇప్పుడు ఈ ఫోటో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.

'నిన్ను చూస్తే గర్వంగా ఉందిరా.. నువ్వు నా జీవితంలోకి రావడం నన్ను గర్వపడేలా చేసింది. నీతో ఉన్నంతసేపు నా కష్టాలన్నీ మరిచిపోతా..' అంటూ ఉద్వేగంతో పేర్కొన్నాడు.  2015లో రైనా తన చిన్ననాటి స్నేహితురాలు ప్రియాంకను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక కూతురు.. కొడుకు సంతానం. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకొని ఎంఎస్‌ ధోనితో పాటు రైనా కూడా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ వీరిద్దరిని అభినందిస్తూ స్వయంగా లేఖ విడుదల చేయడం విశేషం. సెప్టెంబర్‌ 19 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్‌ 13వ సీజన్‌ ఆడడానికి సురేశ్‌ రైనా ఇప్పటికే జట్టుతో పాటే దుబాయ్‌కు చేరుకున్నాడు.
చదవండి :
తండ్రి కాబోతున్న విరాట్‌ కోహ్లి
'నువ్వు ఔట్ అయ్యావు.. క్రీజు వదిలివెళ్లు'

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top