Ashwin Vs Nitin Menon: అంపైర్‌తో అశ్విన్‌ గొడవ.. అది మనసులో పెట్టుకొనేనా?

Ravichandran Ashwin Heat Argument With Umpire Nithin Menon - Sakshi

Heated Argument Between Ravichandran Ashwin And Umpire Nithin Menon.. న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌, అంపైర్‌ నితిన్‌ మీనన్‌ మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటుచేసుకుంది. ఆఫ్‌ స్పిన్నర్‌ అయిన అశ్విన్‌ రౌండ్‌ ది వికెట్‌ బౌలింగ్‌ చేయడం సహజమే. అయితే ఇన్నింగ్స్‌ 77వ ఓవర్లో అశ్విన్‌ ఒక తన శైలికి విరుద్ధంగా స్టంప్స్‌కు దగ్గరగా వెళ్తూ బౌలింగ్‌ చేశాడు. వరుసగా మూడు బంతులను అశ్విన్‌ అలాగే వేశాడు.

చదవండి: Tom Latham: రెండో బ్యాట్స్‌మన్‌గా టామ్‌ లాథమ్ .. 30 ఏళ్ల తర్వాత

ఓవర్‌ ముగిసిన తర్వాత అంపైర్‌ నితిన్‌ మీనన్‌ అశ్విన్‌ను పిలిచి..''నువ్వు స్టంప్స్‌కు దగ్గరగా వెళ్తూ బౌలింగ్‌ చేయడం ద్వారా నా దృష్టికి అడ్డుతగులుతున్నావు. ఎల్బీ కాల్స్‌ సరిగా ఇవ్వలేకపోతున్నా.. అంతేగాక పరోక్షంగా నన్ను.. నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్‌ను ఇబ్బందికి గురిచేశావు'' అంటూ తెలిపాడు.

చదవండి:  అరె ఇద్దరూ ఒకేసారి పరిగెత్తారు.. ఇద్దరూ ఒకేసారి డైవ్‌ చేశారు.. ఆఖరికి

ఇది విన్న అశ్విన్‌.. '' ఎలాగో మీరు ఎల్బీ విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం లేదు.. ఇంకెందుకు'' అంటూ చురకలంటించాడు. ఇంతలో అక్కడికి చేరుకున్న కెప్టెన్‌ రహానే.. అశ్విన్‌ డేంజర్‌ జోన్‌లో(పిచ్‌పైకి) అయితే పరిగెత్తడం లేదు కదా అంటూ తెలిపాడు. దాదాపు అశ్విన్‌ వేసిన మూడు ఓవర్ల పాటు అంపైర్‌ నితిన్‌ మీనన్‌కు.. అతనికి చర్చ జరగడం విశేషం. 

కాగా అంతకముందు ఇన్నింగ్స్‌ 73వ ఓవర్లో లాథమ్‌ 66 పరుగుల వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అశ్విన్‌ వేసిన ఆ ఓవర్‌లో మూడో బంతి లెగ్‌ స్టంప్‌ దిశలో వెళ్లి లాథమ్‌ ప్యాడ్లను తాకింది. అయితే అశ్విన్‌ అ‍ప్పీల్‌ చేయగా.. నితిన్‌ మీనన్‌ ఔటివ్వలేదు. టీమిండియా కూడా రివ్యూకు వెళ్లలేదు. అయితే ఆ తర్వాత రిప్లేలో అల్ట్రాఎడ్జ్‌లో మాత్రం బంతి క్లీన్‌గా స్టంప్స్‌కు తగిలినట్లు చూపించింది. ఇది చూసిన అశ్విన్‌ కోపంతో తన కాలితో గట్టిగా తన్నడం కెమెరాల్లో చిక్కడం వైరల్‌గా మారింది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top