మహ్మద్‌ సిరాజ్‌ ఔట్‌

Rajasthan Won The Toss And Elected To Bat First Against RCB - Sakshi

దుబాయ్‌: ఐపీఎల్‌లో భాగంగా ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ ముందుగా  బ్యాటింగ్‌కు మొగ్గుచూపాడు. ఇప్పటివరకూ ఆర్సీబీ ఎనిమిది మ్యాచ్‌లకు గాను ఐదు మ్యాచ్‌ల్లో గెలిచింది. ఇక రాజస్తాన్‌ రాయల్స్‌ మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. అంతకముందు ఈ సీజన్‌ తొలి అంకం మ్యాచ్‌లో రాజస్తాన్‌పై ఆర్సీబీ ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచింది. ఆ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లి అజేయంగా 72 పరుగులు సాధించడంతో పాటు పడిక్కల్‌ 63 పరుగులు చేశాడు.  ఇక ఈ సీజన్‌లో గత ఐదు మ్యాచ్‌ల్లో ఆర్సీబీ మూడు విజయాలు సాధించగా, రాజస్తాన్‌ రాయల్స్‌ గత ఐదు మ్యాచ్‌ల్లో ఒకదాంట్లో మాత్రమే గెలిచింది. ఓవరాల్‌గా ఇరుజట్లు ఇప్పటివరకూ 21సార్లు తలపడగా రాజస్తాన్‌ రాయల్స్‌ 10సార్లు విజయం సాధించగా, ఆర్సీబీ 9 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఇక రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. (గెలిచారు కదా.. మొహం అలా పెట్టావేంటి?)

ఇక ఇరుజట్ల ఆటగాళ్ల బలబలాల్లో ఆర్సీబీదే పైచేయిగా ఉంది. విరాట్‌ కోహ్లి 304 పరుగులు సాధించగా, పడిక్కల్‌ 261 పరుగులు చేశాడు. డివిలియర్స్‌ 230 పరుగులు చేశాడు. ఇక రాజస్తాన్‌ ఆటగాళ్లలో సంజూ శాంసన్‌ 227 పరుగులు చేయగా, రాహుల్‌ తెవాటియా 203 పరుగులతో ఉన్నాడు.  ఇరుజట్ల అత్యధిక వికెట్ల జాబితాలో రాజస్తాన్‌  పేసర్‌ ఆర్చర్‌ 12 వికెట్లతో ఉండగా, ఆర్సీబీ స్పిన్నర్‌ 11 వికెట్లు సాధించాడు. ఆర్సీబీ పేసర్‌ ఇసురు ఉదానా 7 వికెట్లను తీశాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లి -ఆర్చర్‌ల పోరు జరిగే అవకాశం ఉంది. కోహ్లి 126.66 ఉండగా, ఆర్చర్‌ ఎకానమీ 6.56గా ఉంది.  ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ రెండు మార్పులు చేసింది. శివం దూబే, సిరాజ్‌లకు విశ్రాంతి ఇచ్చారు. గుర్‌కీరత్‌ మన్‌, షహబాజ్‌ అహ్మద్‌లకు తుదిజట్టులో చోటు దక్కింది.ఇక రాజస్తాన్‌ ఎటువంటి మార్పులు లేకుండా పోరుకు సిద్ధమైంది.

ఆర్సీబీ
విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), ఏబీ డివిలియర్స్‌, అరోన్‌ ఫించ్‌, దేవదూత్‌ పడిక్కల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, గుర్‌కీరత్‌ మన్‌, షహ్‌బాజ్‌ అహ్మద్‌, క్రిస్‌ మోరిస్‌, ఇసురు ఉదాన, నవదీప్‌ సైనీ,  చహల్‌

రాజస్తాన్‌
బెన్‌స్టోక్స్‌, జోస్‌ బట్లర్‌, స్టీవ్‌ స్మిత్‌(కెప్టెన్‌), సంజూ శాంసన్‌, రాబిన్‌ ఊతప్ప, రియాన్‌ పరాగ్‌, రాహుల్‌ తెవాటియా, జోఫ్రా ఆర్చర్‌, శ్రేయస్‌ గోపాల్‌, జయదేవ్‌ ఉనాద్కత్‌, కార్తీక్‌ త్యాగి

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top