ప్రజ్ఞానంద సంచలనం 

Praggnanandhaa Beats Firouzja In FTX Crypto Cup Chess - Sakshi

మయామి: ఎఫ్‌టీఎక్స్‌ క్రిప్టో కప్‌ అంతర్జాతీయ ర్యాపిడ్‌ చెస్‌ టోర్నమెంట్‌లో భారత యువ గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద సంచలనంతో శుభారంభం చేశాడు. అమెరికా వేదికగా ఎనిమిది మంది మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య లీగ్‌ పద్ధతిలో ఈ టోర్నీ జరుగుతోంది. తొలి రౌండ్‌ మ్యాచ్‌లో తమిళనాడుకు చెందిన 17 ఏళ్ల ప్రజ్ఞానంద 2.5–1.5తో ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ అలీరెజా ఫిరూజా (ఫ్రాన్స్‌)పై గెలుపొందాడు. ఈ విజయంతో ప్రజ్ఞానందకు 7,500 డాలర్ల (రూ. 5 లక్షల 94 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. ప్రపంచ చాంపియన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ (నార్వే), లెవాన్‌ అరోనియన్‌ (అమెరికా), జాన్‌ క్రిస్టాఫ్‌ డూడా (పోలాండ్‌), లియెమ్‌ లీ (వియత్నాం), హాన్స్‌ నీమెన్‌ (అమెరికా), అనీశ్‌ గిరి (నెదర్లాండ్స్‌) కూడా ఈ టోర్నీలో ఆడుతున్నారు.   
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top