ICC ODI Cricketer: ఐసీసీ వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా బాబర్‌ ఆజం

Pakistan Capitan Babar Azam Won ICC-Mens-ODI-Player-of-Year Award - Sakshi

2022 ఏడాదికి గానూ ఐసీసీ మెన్స్‌ వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం నిలిచాడు. గతేడాది 9 వన్డేల్లో 84.87 సగటుతో 679 పరుగులు చేసిన బాబర్‌ ఖాతాలో మూడు సెంచరీలు, ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2021లో ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కించుకున్న బాబర్ ఆజం వరుసగా రెండో ఏడాది కూడా అవార్డు దక్కించుకోవడం విశేషం. ప్రస్తుతం బాబర్‌ ఆజం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో(బ్యాటింగ్‌ విభాగం) నెంబర్‌వన్‌గా కొనసాగుతున్నాడు. 2021 జూలైలో టీమిండియా స్టార్‌ విరాట్ కోహ్లీని వెనక్కి నెట్టి అగ్రస్థానం కైవసం చేసుకున్నాడు. ఇక 2022 ఐసీసీ టి20 క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా సూర్యకుమార్‌ యాదవ్‌ నిలిచిన విషయం విధితమే.

ఇక వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2022 రేసులో నిలిచిన ఆడమ్ జంపా, సికిందర్ రజా, వెస్టిండీస్ ఓపెనర్‌ షెయ్‌ హోప్‌ల కంటే ఎక్కువ ఓట్లు దక్కించుకొని బాబర్‌ ఆజం తొలి స్థానంలో నిలిచాడు. ఎంఎస్ ధోనీ, ఏబీ డివిల్లియర్స్, విరాట్ కోహ్లీ తర్వాత వరుసగా రెండో ఏడాది వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డుడు సొంతం చేసుకున్న ఆటగాడిగా బాబర్‌ ఆజం రికార్డులకెక్కాడు.

దీంతో పాటు బాబర్‌ ఆజం 2022 ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ రేసులోనూ ఉన్నాడు. ఈ అవార్డుకు బాబర్ ఆజం‌తో పాటు ఇంగ్లండ్‌ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్, జింబాబ్వే ఆల్‌రౌండర్ సికిందర్ రజా, న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీలు పోటీ పడుతున్నారు

ఇంగ్లండ్ అంపైర్ రిచర్డ్ ఇల్లింగ్‌వార్త్.. ఐసీసీ 2022 అంపైర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కించుకున్నాడు. ఈ అంపైర్‌కు అవార్డు రావడం ఇది రెండోసారి. గతంలో 2019లోనూ ఇల్లింగ్‌వార్త్‌ విజేతగా నిలిచాడు.సౌతాఫ్రికా యంగ్ ఫాస్ట్ బౌలర్ మార్కో జాన్సెన్‌ ఐసీసీ మెన్స్ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డు కైవసం చేసుకున్నాడు. గతేడాది 36 టెస్టు వికెట్లు తీసిన మార్కో జాన్సెన్‌.. వన్డేల్లో రెండు, టి20ల్లో ఒక వికెట్ తీశాడు. బ్యాటింగ్‌లో 234 పరుగులు సాధించాడు.

చదవండి: టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌లో టీమిండియా.. కివీస్‌తో పోరుకు సై

Hulk Hogan: అసభ్యకర ట్వీట్‌ చేసిన రెజ్లింగ్‌ స్టార్‌.. ఆపై తొలగింపు

'సూర్య లేకుంటే మూడు ఫార్మాట్లు లేనట్లే'

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top