ధోని వచ్చేశాడు | Match between Sunrisers Hyderabad vs Chennai Super Kings on Saturday | Sakshi
Sakshi News home page

ధోని వచ్చేశాడు

Apr 17 2026 3:56 AM | Updated on Apr 17 2026 3:57 AM

Match between Sunrisers Hyderabad vs Chennai Super Kings on Saturday

సాక్షి, హైదరాబాద్‌: ఐపీఎల్‌లో భాగంగా ఉప్పల్‌ స్టేడియంలో శనివారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌ అమితాసక్తిని రేపుతోంది. గత మ్యాచ్‌లో గెలిచిన హైదరాబాద్‌ అదే జోరును కొనసాగించాలని భావిస్తుండగా...వరుసగా రెండు విజయాల తర్వాత చెన్నై కూడా అమితోత్సాహంతో బరిలోకి దిగనుంది. అయితే స్టార్‌ ప్లేయర్‌ మహేంద్ర సింగ్‌ ధోని ఈ మ్యాచ్‌లోనైనా ఆడతాడా లేదా అనేదే అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తున్న అంశం. 

గాయంతో బాధపడుతున్న ధోని ఇప్పటి వరకు సీఎస్‌కే ఆడిన ఐదు మ్యాచ్‌లలో కూడా బరిలోకి దిగలేదు. కోల్‌కతాతో జరిగిన గత మ్యాచ్‌కు ముందు ధోని సుదీర్ఘ సమయం పాటు నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేశాడు. మ్యాచ్‌ ఆడకపోయినా పూర్తి ఫిట్‌గా కనిపించాడు. చెన్నైలో ఆగిపోకుండా అతను హైదరాబాద్‌కు రావడంతోనే మ్యాచ్‌ ఆడతాడనే అంచనాలు పెరిగాయి. గురువారం ఫ్యామిలీతో కలిసి నగరానికి వచ్చిన ధోనిని చూసేందుకు శంషాబాద్‌ విమానాశ్రయంలో అభిమానులు పెద్ద సంఖ్యలో ఎగబడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement