IPL 2022: Who Will Win Today’s IPL Match Between RR and GT? - Sakshi
Sakshi News home page

IPL 2022: రాజస్తాన్‌ను ఢీ కొట్టేందుకు సిద్ధమైన గుజరాత్‌.. విజయం ఎవరిది.. ?

Published Thu, Apr 14 2022 12:35 PM

IPL 2022: Who will win todays IPL match between RR and GT - Sakshi

 RR vs GT Match Prediction: ఐపీఎల్‌-2022లో డివై పాటెల్‌ స్టేడియం వేదికగా రాజస్తాన్‌ రాయల్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యాయి. ఇరు జట్లు మధ్య ఈ ఆసక్తికర పోరు గురువారం సాయంత్రం 7: 30 గంటలకు ప్రారంభం కానుంది. కాగా తమ అఖరి మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌పై విజయం సాధించి మంచి మీద ఉన్న రాజస్తాన్‌ ఈ మ్యాచ్‌లో కూడా అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది.

ఇక ఎస్‌ఆర్‌హెచ్‌ చేతిలో ఓటమి చెందిన గుజరాత్‌ కూడా ఈ మ్యాచ్‌లో విజయం సాధించి తమ విన్నింగ్‌ ట్రాక్‌ను తిరిగి పొందాలని అనుకుంటుంది. ఇక బ్యాటింగ్‌, బౌలింగ్‌ పరంగా ఇరు జట్లు పటిష్టంగా కన్పిస్తున్నాయి. దీంతో ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోటీ తప్పదు. 

పిచ్‌ రిపోర్ట్‌
డివై పాటెల్‌ స్టేడియం వేదికగా జరిగిన చివరి రెండు మ్యాచ్‌ల్లో పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలించింది. తొలుత బ్యాటింగ్‌ చేసే జట్టు త్వరగా వికెట్లు కోల్పోకుండా ఉండడం  చాలా ముఖ్యం.. ఎందకుంటే ఈ ట్రాక్‌ నెమ్మదిగా బ్యాటింగ్‌ అనూకూలిస్తోంది. మంచు ప్రభావం ఎ‍క్కువగా లేకపోయినప్పటికీ.. టాస్‌ గెలిచిన జట్టు తొలుత బౌలింగ్‌ ఎంచకునే అవకాశం​ ఉంది.

తుది జట్లు అంచనా
రాజస్థాన్ రాయల్స్
జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్, సంజు శాంసన్ (కెప్టెన్‌), రాస్సీ వాన్ డెర్ డుసెన్, షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, కుల్దీప్ సేన్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్

గుజరాత్‌ టైటాన్స్‌
మాథ్యూ వేడ్ (వికెట్‌ కీపర్‌), శుభమన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్‌), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, అభినవ్ మనోహర్, రషీద్ ఖాన్, లాకీ ఫెర్గూసన్, మహమ్మద్ షమీ, ఆర్‌ సాయి కిషోర్‌

Advertisement
Advertisement