Jasprit Bumrah: బుమ్రా సరికొత్త రికార్డు.. ఇంతవరకు ఏ భారత పేసర్‌కు సాధ్యం కాని రీతిలో!

IPL 2022 MI vs SRH: Jasprit Bumrah Sets New T20 Record 1st Indian Pacer To - Sakshi

IPL 2022 MI vs SRH- Jasprit Bumrah Record: టీమిండియా స్టార్‌ బౌలర్‌, ముంబై ఇండియన్స్‌ ఆటగాడు జస్‌ప్రీత్‌ బుమ్రా టీ20 ఫార్మాట్‌లో అరుదైన ఘనత సాధించాడు. పొట్టి ఫార్మాట్‌ క్రికెట్‌లో 250 వికెట్లు పడగొట్టిన తొలి భారత పేసర్‌గా నిలిచాడు. ఐపీఎల్‌-2022లో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌ సందర్భంగా ఈ ఫీట్‌ నమోదు చేశాడు.

సన్‌రైజర్స్‌ ఆటగాడు వాషింగ్టన్‌ సుందర్‌ను అవుట్‌ చేయడం ద్వారా బుమ్రా అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఇక టీ20 క్రికెట్‌లో బుమ్రా తర్వాత అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్‌బౌలర్‌గా సన్‌రైజర్స్‌ ప్లేయర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ రెండో స్థానంలో నిలిచాడు. 

ఇక మ్యాచ్‌ విషయానికొస్తే... ఆఖరి వరకు పోరాడిన ముంబై ఇండియన్స్‌ 3 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌ చేతిలో ఓటమి పాలైంది. రైజర్స్‌ 193 పరుగులు చేసి, గెలుపొందడంలో కీలక పాత్ర పోషించిన రాహుల్‌ త్రిపాఠికి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది. ముంబై బౌలర్లలో డేనియల్‌ సామ్స్‌, రిలే మెరిడిత్‌, బుమ్రా ఒక్కో వికెట్‌ తీయగా.. రమణ్‌దీప్‌ సింగ్‌ ఏకంగా మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

టీ20 క్రికెట్‌: అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్లు
►జస్‌ప్రీత్‌ బుమ్రా- 250
►భువనేశ్వర్‌ కుమార్‌- 223
►జయదేవ్‌ ఉనద్కట్‌- 201
►వినయ్‌ కుమార్‌-194
►ఇర్ఫాన్‌ పఠాన్‌- 173 

చదవండి👉🏾IPL 2022: అతడి వల్లే సన్‌రైజర్స్‌కు విజయాలు.. బుమ్రా బౌలింగ్‌నూ చితక్కొట్టేస్తాడు! టీ20 సిరీస్‌కు ఎంపిక చేయండి!

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top