Trolls On Ishan Kishan: ధర 15 కోట్లు.. ఇషాన్‌ ఇదేమైనా టెస్టు మ్యాచ్‌ అనుకున్నావా? పాపం ముంబై ఫ్రాంఛైజీ

IPL 2022 MI Vs LSG: Fans Trolls Ishan Kishan For His Batting Against LSG - Sakshi

IPL 2022 MI Vs LSG:- ఇషాన్‌ కిషన్‌... ఐపీఎల్‌-2022 మెగా వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడు. రిటెన్షన్‌ సమయంలో ఈ టీమిండియా యువ బ్యాటర్‌ను వదిలేసిన ముంబై ఇండియన్స్‌.. ఆక్షన్‌లో మాత్రం ఇతర ఫ్రాంఛైజీలతో పోటీ మరి దక్కించుకుంది. అందుకోసం 15. 25 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఈ సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లలో ఇషాన్‌ అదరగొట్టినా(ఢిల్లీపై 81 పరుగులు- నాటౌట్‌, రాజస్తాన్‌ రాయల్స్‌పై 54 పరుగులు) దానిని కొనసాగించలేకపోతున్నాడు. తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వడంలో విఫలమవుతున్నాడు.    

గత ఆరు మ్యాచ్‌లలో మొత్తంగా ఇషాన్‌ సాధించిన పరుగులు కేవలం 64(సగటు). ఇక లక్నో సూపర్‌జెయింట్స్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌లో ఇషాన్‌ కిషన్‌ ప్రదర్శన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో 20 బంతులు ఎదుర్కొన్న ఈ ఓపెనర్‌ సాధించింది కేవలం 8 పరుగులు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇషాన్‌ కిషన్‌ ఆటతీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘‘పాపం ముంబై ఫ్రాంఛైజీ... వేలంలో ఇషాన్‌ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. అదంతా బూడిదలో పూసిన పన్నీరేనా! మరీ 20 బంతుల్లో ఎనిమిది పరుగులా? 

ఇదేమన్నా టెస్టు మ్యాచ్‌ అనుకుంటున్నవా ఇషాన్‌! పాపం ఇషాన్‌ మోసం(ఆటతీరుతో) చేసినంతగా ముంబై ఓనర్లను మరెవరూ మోసం చేసి ఉండరేమో!’’ అంటూ సోషల్‌ మీడియా వేదికగా నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు. కాగా ఆరంభ మ్యాచ్‌లలో అద్బుత ఇన్నింగ్స్‌ ఆడిన ఇషాన్‌.. ఆరెంజ్‌ క్యాప్‌ పోటీదారుగా నిలుస్తాడనుకుంటే.. ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్‌లలో కలిపి 199 పరగులు చేసి 23వ స్థానంలో ఉన్నాడు. కాగా లక్నోతో మ్యాచ్‌లో ముంబై 36 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తద్వారా వరుసగా ఎనిమిదో పరాజయం నమోదు చేసి ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించింది.

చదవండి: IPL 2022: జోరు మీదున్న లక్నోకు గట్టి షాక్‌! మళ్లీ అదే తప్పు.. భారీ జరిమానా

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top