IPL 2022 MI Vs KKR Highlights: Trending Videos On Social Media - Sakshi
Sakshi News home page

IPL Trending: కమిన్స్‌ సంబరం.. చిరాకులో రోహిత్‌.. చెమటోడుస్తున్న ఢిల్లీ ఆటగాళ్లు

Apr 7 2022 12:42 PM | Updated on Apr 7 2022 3:04 PM

IPL 2022 MI Vs KKR Trending: 7th April 2022 IPL Viral Videos On Social Media - Sakshi

ఫొటో కర్టెసీ: IPL/BCCI

IPL 2022 Trending Videos: ఐపీఎల్‌-2022లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే కోల్‌కతా నైట్‌రైడర్స్‌ పేసర్‌ ప్యాట్‌ కమిన్స్‌ అదరగొట్టాడు. అయితే, ఈసారి అనూహ్యంగా బ్యాట్‌తో రాణించడం విశేషం. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 14 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్న కమిన్స్‌.. కేకేఆర్‌ను విజయతీరాలకు చేర్చాడు. 15 బంతుల్లోనే 56 పరుగులు సాధించి కేకేఆర్‌ గెలుపులో కీలక పాత్ర పోషించాడు.

తద్వారా ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. అనంతరం అతడు మాట్లాడుతూ... తన ఇన్నింగ్స్‌ తనకే ఆశ్చర్యం కలిగించిందని వ్యాఖ్యానించాడు. ఏదేమైనా అద్భుత ప్రదర్శనతో ఈ సీజన్‌ ఆరంభించడం సంతోషంగా ఉందన్నాడు. 

ముంబై ఇండియన్స్‌పై 5 వికెట్ల తేడాతో కేకేఆర్‌ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన హైలైట్స్‌తో పాటు వివిధ జట్లకు సంబంధించిన అప్‌డేట్లు తెలిపే వీడియోలపై ఓ లుక్కేద్దామా!

కమిన్స్‌ కమాల్‌..ముంబై ఇండియన్స్‌కు వరుసగా మూడో ఓటమి. ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ సాధించిన ప్యాట్‌ కమిన్స్‌

వరుస ఓటములతో చిరాకులో ఉన్న రోహిత్‌ శర్మ

లక్నో సూపర్‌జెయింట్స్‌తో ఏప్రిల్‌ 7న తలపడేందుకు సిద్ధమవుతోన్న ఢిల్లీ క్యాపిటల్స్‌. నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్న ఢిల్లీ బ్యాటర్లు, బౌలర్లు

ఐపీఎల్‌-2022లో ఆడేందుకు ఆతురతగా ఎదురుచూస్తున్నానన్న డేవిడ్‌ వార్నర్‌

నవీ ముంబైకి చేరుకున్న లక్నో క్రికెటర్లు

Advertisement
 
Advertisement
Advertisement