90 నిమిషాల్లో వెళ్లాలి.. లేకపోతే కోహ్లికి ఫైన్‌..! | IPL 2021:If Flight Take More Time, Kohli Will Be Fined, Mr Nags | Sakshi
Sakshi News home page

90 నిమిషాల్లో వెళ్లాలి.. లేకపోతే కోహ్లికి ఫైన్‌..!

Apr 20 2021 2:02 PM | Updated on Apr 20 2021 5:58 PM

IPL 2021:If Flight Take More Time, Kohli Will Be Fined, Mr Nags - Sakshi

Photo Courtesy: RCB Twitter

ఆర్సీబీ ఇక చాలు... ఇటు నుంచి ఇటే బెంగ‌ళూరుకు వెళ్లిపోదాం

ముంబై:  ఈ ఐపీఎల్‌ సీజన్‌లో రాయల్స్‌ చాలెంజర్స్‌ బెంగళూరు వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇప్పటివరకూ ఈ సీజన్‌లో ఆర్సీబీ ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి హ్యాట్రిక్‌ విజయాలు నమోదు చేసింది. దాంతో మంచి జోష్‌లో ఉంది కోహ్లి గ్యాంగ్‌. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో కోహ్లి సేన టాప్‌లో కొనసాగుతోంది. చెన్నైలో చెపాక్‌లో మ్యాచ్‌లు ముగించుకుని ముంబైలోని వాంఖడేలో ఆడటానికి సిద్ధమైంది ఆర్సీబీ. ఆ క్రమంలోనే ఆర్సీబీ ముంబైకి బయల్దేరింది. కాగా, చెన్నై నుంచి ముంబైకు వెళ్లబోయే విమానంలో కమెడియన్‌ డానిష్‌ సైత్‌ వినోదాన్ని అందించాడు.  ‘మిస్ట‌ర్ నాగ్స్‌’గా పేరుగాంచిన డానిష్‌ సైత్‌.. ఆర్సీబీకి హెస్ట్‌గా ప్రజెంటర్‌గా వ్యవహరించాడు. 

ఈ సంద‌ర్భంగా అత‌డు కెప్టెన్ కోహ్లిపైనే పంచ్‌లు వేశాడు.  కోహ్లికి మ్యాచ్‌ల్లో స్లో ఓవర్‌ రేట్‌ నమోదు చేసి జరిమానాల బారిన పడటం సర్వసాధారణమే. అదే విషయంపై పంచ్‌ వేస్తూ .. ఫ్లైట్‌ 90 నిమిషాల్లో ముంబైకి వెళ్లాలి.. లేకపోతే కోహ్లికి ఫైన్‌ వేద్దాం అంటూ సెటైర్‌ వేశాడు.  అంతేకాదు ఐపీఎల్‌లో ఎప్పుడూ బెంగ‌ళూరు ఇలా టాప్‌లో లేదు. ఇక చాలు. దీనిని ఇలా ముగిద్దాం. ముంబైకి వ‌ద్దు ఇటు నుంచి ఇటే బెంగ‌ళూరుకు వెళ్లిపోదాం. ఇక టోర్నీలో ఆడొద్దు అంటూ కోచ్‌, కెప్టెన్ స‌హా టీమ్‌లోని ప్ర‌తి ప్లేయ‌ర్ ద‌గ్గ‌రికీ వెళ్లి అత‌డు అన‌డం చాలా ఫ‌న్నీగా ఉంది.  

‘ముంబైలో కేవలం ఏబీ డివిలియర్స్‌ మీద ఆధారపడకండి.. గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ ఉన్నాడు. షెహబాజ్‌ అహ్మద్‌ ఉన్నాడు.. హర్షల్‌ పటేల్‌ ఉన్నాడు.. వారి సాయం తీసుకోండి. మీకు సాయం చేస్తారు’ అంటూ నవ్వులు పూయించాడు. చివ‌రికి అతని బాధ‌ను తట్టుకోలేని జట్టు సభ్యులంతా అత‌న్ని ఫ్లైట్‌లోని బాత్‌రూమ్‌లో వేసి లాక్ చేస్తారు.  దీనికి సంబంధించిన వీడియోను ఆర్సీబీ తన ట్వీటర్‌ హ్యాండిల్‌లో పోస్ట్‌ చేసింది. ఇది ప్రస్తుతం వైరల్‌గా మారడంతో ఫ్యాన్స్‌ తిరిగి రీట్వీట్‌లు చేస్తున్నారు. ముంబైలో కూడా ఇదే జోష్‌ ఉండాలి.. తగ్గొద్దు అంటూ కొంతమంది ఫ్యాన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు. 

ఇక్కడ చదవండిఅలా అయితే ధోని సేనదే టైటిల్‌: బ్రియన్‌ లారా

సామ్సన్‌.. అక్కడ ఉంది బాస్‌ ధోని !

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement