Shikhar Dhawan: పోలిక వద్దు.. రిస్క్‌ ఎప్పుడు చేయాలో తెలుసు

IPL 2021: I Dont Have To Compare With Others, Shikhar Dhawan - Sakshi

అహ్మదాబాద్‌: గత ఐపీఎల్‌ సీజన్‌లో కొనసాగించిన ఫామ్‌ను ప్రస్తుత సీజన్‌లో కూడా కొనసాగిస్తూ డిల్లీ క్యాపిటల్స్‌కు మంచి ఆరంభాలు ఇస్తున్నాడు ​ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌. కేకేఆర్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో సహచర ఓపెనర్‌ పృథ్వీ షా( 82; 41 బంతుల్లో​ 11 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడితే ధవన్‌ (46; 47 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) నెమ్మదిగా ఆడాడు.

మ్యాచ్‌ తర్వాత అవార్డుల ​కార్యక్రమంలో ధవన్‌ మాట్లాడుతూ.. ‘పృథ్వీ షా బ్యాటింగ్‌ అమోఘం. నాన్‌ స్టైకింగ్‌ ఎండ్‌ నుంచి అతడి బ్యాటింగ్‌ను ఎంజాయ్‌ చేశా. మా ఇద్దరి భాగస్వామ్యం బాగుంది.  నేను రిస్క్‌ షాట్లు  కొడదామని ఆలోచించలేదు.  గేమ్‌ పరిస్థితిని బట్టే బ్యాటింగ్‌ చేశా. నేను ఎక్కడ ఎవరితోనూ పోల్చుకోను. గేమ్‌ పరిస్థితిని బట్టే నా ఆట ఉంటుంది. అదే నేను చేశా. నా స్టైక్‌ రేట్‌ను కాపాడుకుంటూ బ్యాటింగ్‌ చేశా.

ఈ గేమ్‌కు రిస్క్‌ చేయాలా వద్దా అనేది ఓపెనర్‌గా ఆలోచిస్తా. మనకు ఎప్పుడు రిస్క్‌ చేయాలో, ఎప్పుడు చేయకూడదో తెలిస్తే అది స్మార్ట్‌ క్రికెట్‌.  కేకేఆర్‌తో మ్యాచ్‌లో నాకు రిస్క్‌ చేసే అవసరం రాలేదు. పృథ్వీ  షా ఆట వేరే లెవెల్‌లో ఉంది. స్మార్ట్‌ రిస్క్‌లు తీసుకోవడాన్ని ఎంజాయ్‌ చేస్తా. అదే సమయంలో నా ఆట కొత్త ఉండటం కోసం ట్రై చేస్తా’ అని తెలిపాడు. కాగా, ఇప్పటివరకూ 7 మ్యాచ్‌లు ఆడిన ధవన్‌.. 311 పరుగులతో టాప్‌లో ఉన్నాడు. ప్రస్తుతం ఆరెంజ్‌ క్యాప్‌ హోల్టర్‌ అయిన ధవన్‌.. ఇదే ఫామ్‌ను మిగతా మ్యాచ్‌ల్లో కూడా కొనసాగిస్తానన్నాడు. కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సంగతి తెలిసిందే.

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top