Indian Skeet Shooters Drive Between Countries For COVID-19 Vaccine, From Italy To Croatia - Sakshi
Sakshi News home page

టీకా కోసం ఇటలీ నుంచి క్రొయేషియాకు...

Jul 2 2021 9:22 AM | Updated on Jul 2 2021 12:17 PM

Indian Skeet Shooters From Italy To Croatia for COVID Vaccine - Sakshi

న్యూఢిల్లీ: భారత స్కీట్‌ షూటర్లు మేరాజ్‌ అహ్మద్‌ ఖాన్, అంగద్‌ వీర్‌ సింగ్‌ బాజ్వా కోవిడ్‌ వ్యాక్సిన్‌ కోసం సుదీర్ఘ ప్రయాణం చేశారు. ఇటలీ నుంచి క్రొయేషియాకు కారులో వెళ్లారు. దాదాపు 1000 కిలోమీటర్లు పయనించి టీకా తీసుకున్నారు. ఈ ఇద్దరు షూటర్లు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు.

ప్రత్యేక శిక్షణ కోసం ఇటలీకి వచ్చారు. తుది సన్నాహాల్లో నిమగ్నమైన మేరాజ్, అంగద్‌ ప్రస్తుతం క్రొయేషియాలోని ఒసిజెక్‌లో జరుగుతున్న ప్రపంచకప్‌ షూటింగ్‌కు దూరంగా ఉన్నారు. టోక్యో వెళ్లాలంటే అథ్లెట్లందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్‌ తీసుకోవాలనే నిబంధన ఉంది. ఇటలీలో వ్యాక్సిన్‌ లేకపోవడంతోపాటు మెగా ఈవెంట్‌కు సమయం దగ్గరపడుతుండటంతో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇద్దరు అథ్లెట్లు క్రొయేషియాకు వెళ్లి వ్యాక్సిన్‌ తీసుకున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement