ఐదో టీ20‌: టీమిండియా గ్రాండ్‌ విక్టరీ..3-2 తేడాతో సిరీస్‌ కైవసం‌‌‌‌‌‌‌

Ind vs Eng: Toss, Live Updates For 5th T20 - Sakshi

టీమిండియా గ్రాండ్‌ విక్టరీ..3-2 తేడాతో సిరీస్‌ కైవసం
5 టీ20ల సిరీస్‌లో భాగంగా అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన ఆఖరి టీ20లో టీమిండియా గ్రాండ్‌ విక్టరీ సాధించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. ప్రత్యర్ధి ముందు భారీ లక్ష్యాన్ని(225) ఉంచింది. అనంతరం ఛేదనలో ఇంగ్లండ్‌ జట్టు ఆరంభంలో మెరుపుదాడి చేసినపక్పటికీ...క్రమంగా పట్టు కోల్పోయి మ్యాచ్‌ను చేజార్చుకుంది. నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ 8 వికెట్ల నష్టానికి 188 పరగులు సాధించింది. దీంతో టీమిండియా36 పరుగుల తేడాతో ఆతిధ్య జట్టుపై విజయం సాధించి, 3-2 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుం‍ది.  టీమిండియా బౌలర్లలో శార్ధూల్‌ 3, భువనేశ్వర్‌ 2, నటరాజన్‌ ఒక వికెట్‌ పడగొట్టాడు. ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్‌ మార్చి 23న ప్రారంభంకానుంది.

స్టోక్స్‌(14) ఔట్‌
నటరాజన్‌ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ పంత్‌ క్యాచ్‌ పట్టడంతో స్టోక్స్(12 బంతుల్లో 14; 2 ఫోర్లు)‌ పెవిలియన్‌ బాట పట్టాడు.

క్యూకట్టిన ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్లు
వరుసగా రెండు బంతులను డాట్‌ బాల్స్‌గా మలిచిన పాండ్యా మూడో బంతికి ఇంగ్లండ్‌ కెప్టెన్‌ మోర్గాన్‌ను(1) పెవిలియన్‌కు పంపాడు. సబ్‌స్టిట్యూట్‌ ఫీల్డర్‌ రాహుల్‌ క్యాచ్‌ పట్టడంతో మోర్గాన్‌ పెవిలియన్‌కు చేరాడు. 16 ఓవర్లు ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ 5 వికెట్ల నష్టానికి  144 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌ గెలవాలంటే 26 బంతుల్లో 81 పరుగులు చేయాల్సి ఉంది. 

డేంజర్‌ మేన్‌ మలాన్‌(68) క్లీన్‌బౌల్డ్‌
డేంజర్‌ మేన్‌ డేవిడ్‌ మలాన్‌ను (46 బంతుల్లో 68; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు‌) శార్ధూల్‌ ఠాకూర్‌ క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. 14 ఓవర్‌ ఆఖరి బంతికి మలాన్‌ నాలుగో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. 

మూడో వికెట్‌ డౌన్‌.. బెయిర్‌ స్టో(7) ఔట్‌
బట్లర్‌ వికెట్‌ పడడంతో ఇంగ్లండ్‌ జోరు తగ్గింది. ఆవెంటనే బెయిర్‌ స్టో(7 బంతుల్లో 7; ఫోర్‌) కూడా వెనుదిరగడంతో ఇంగ్లండ్‌ సెల్ఫ్‌ డిఫెన్స్‌లో పడింది. 14 ఓవర్‌ 3 బంతికి శార్ధూల్‌ బౌలింగ్‌లో సూర్యకుమార్‌ క్యాచ్‌ పట్టడంతో బెయిర్‌ స్టో పెవిలియన్‌ బాట పట్టాడు. 

రెండో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌.. బట్లర్‌(52) ఔట్‌
ధాటిగా ఆడుతున్న ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌(34 బంతుల్లో 52; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు‌) భువనేశ్వర్‌ బౌలింగ్‌లో హార్ధిక్‌ పాండ్యా క్యాచ్‌ పట్టడంతో పెవిలియన్‌కు చేరాడు. దీంతో 13 ఓవర్లు ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ 2 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌ గెలవాలంటే 42 బంతుల్లో 95 పరుగులు చేయాల్సి ఉంది.

మలాన్‌, బట్లర్‌ మెరుపు అర్ధశతకాలు
సిరీస్‌ను ఎలాగైనా చేజిక్కించుకోవాలనే కసితో బ్యాటింగ్‌ చేస్తున్న ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్లు.. టీమిండియా బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. బట్లర్‌(31 బంతుల్లో 51; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు‌), మలాన్‌(39 బంతుల్లో 64; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు‌)లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి మెరుపు అర్ధశతకాలు సాధించడంతో ఇంగ్లండ్ ‌12 ఓవర్లు ముగిసే సరికి వికెట్‌ నష్టానికి 127 పరుగులు చేసింది. ప్రస్తుతం ఇంగ్లండ్‌ గెలవాలంటే 48 బంతుల్లో 98 పరుగులు చేయాల్సి ఉంది. 

9.2 ఓవర్లలోనే ఇంగ్లండ్‌ 100 పరుగులు
ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్లు బట్లర్‌(24 బంతుల్లో 45; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు‌), మలాన్‌(30 బంతుల్లో 46; 7 ఫోర్లు, సిక్స్‌) ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాదుతుండడంతో కేవలం 9.2 ఓవర్లలోనే ఇంగ్లండ్‌ 100 పరుగుల మార్కును దాటింది.

ధీటుగా జవాబిస్తున్న ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్లు
రెండో బంతికే ఓపెనర్‌ రాయ్‌ వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌ జట్టు.. ఏమాత్రం తడబాటుకు లోనుకాకుండా టీమిండియాకు ధీటుగా జవాబిస్తుంది. క్రీజ్‌లో ఉన్న బట్లర్‌(12 బంతుల్లో 22; 2 ఫోర్లు, సిక్స్‌), మలాన్‌(16 బంతుల్లో 27; 4 ఫోర్లు, సిక్స్‌) స్వేచ్ఛగా షాట్లు ఆడుతూ స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. దీంతో 5 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్‌ స్కోర్‌ వికెట్‌ నష్టానికి 55 పరుగులుగా ఉంది. 

రెండో బంతికే వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్
భువనేశ్వర్‌ వేసిన తొలి ఓవర్‌ రెండో బంతికే ఇంగ్లండ్‌ ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌(0) డకౌటయ్యాడు. దీంతో తొలి ఓవర్‌ ముగిసాక ఇంగ్లండ్‌ స్కోర్‌ 1/1. క్రీజ్‌లో బట్లర్‌(0), మలాన్‌(1) ఉన్నారు.

భారత్‌ 224/2..ఇంగ్లండ్‌ టార్గెట్‌ 225
కోహ్లి(52 బంతుల్లో 80; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), హార్ధిక్‌(17 బంతుల్లో 39; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు)లు ధాటిగా ఆడడంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సమయానికి టీమిండియా 2 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో స్టోక్స్‌, ఆదిల్‌ రషీద్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.

కోహ్లి బాధ్యతాయుతమైన హాఫ్‌ సెంచరీ
ఓ పక్క రోహిత్‌, సూర్యకుమార్‌ ధాటిగా ఆడుతుండడంతో కెప్టెన్‌ కోహ్లి ఓపిగ్గా ఆడుతూ ఎక్కువ శాతం వారికే స్ట్రయిక్‌ రోటేట్‌ చేస్తూ వచ్చాడు. అయితే లుజ్‌ బంతులపై ఏమాత్రం​ దయ చూపని కోహ్లి అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని 36 బంతుల్లో 50 పరుగులు సాధించాడు. దీంతో15.2 ఓవర్లు ముగిసే సమయానికి టీమిండియా స్కోర్‌ 161/2. క్రీజ్‌లో కోహ్లికి తోడుగా హార్ధిక్‌(7) ఉన్నాడు.

సూర్యకుమార్‌‌(32)ఔట్‌..టీమిండియా‌ 143/2
బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడిన సూర్యకుమార్‌ను ఆదిల్‌ రషీద్‌ బోల్తా కొట్టించాడు. 14వ ఓవర్‌ రెండో బంతికి భారీ షాట్‌కు ప్రయత్నించిన సూర్యకుమార్‌.. క్రిస్‌ జోర్డాన్‌ అద్భుతమైన ఫీల్డింగ్‌ విన్యాసం చేసి జేసన్‌ రాయ్‌ బంతినందివ్వడంతో పెవిలియన్‌ బాట పట్టాడు. 

ధాటిగా ఆడుతున్న సూర్యకుమార్‌, కోహ్లి
రోహిత్‌ వికెట్‌ పడ్డాక కూడా టీమిండియా జోరు ఏమాత్రం తగ్గలేదు. క్రీజ్‌లో ఉన్న కోహ్లి(29 బంతుల్లో 39; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), సూర్యకుమార్‌(16 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) సిక్సర్లు, బౌండరీలతో స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. ముఖ్యంగా సూర్యకుమార్‌ తన సూర్యప్రతాపం చూపిస్తున్నాడు. దీంతో టీమిం‍డియా 13 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్‌ నష్టానికి 142 పరుగులు చేసింది. ‌

రోహిత్‌(64) బౌల్డ్..టీమిండియా‌ 94/1
వరుస బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడిన ఓపెనర్‌ రోహిత్‌ శర్మ(34 బంతుల్లో 64; 4 ఫోర్లు, సిక్స్‌లు) ఎట్టకేలకు అవుటయ్యాడు. స్టోక్స్‌ బౌలింగ్‌లో బంతి ఇన్‌సైడ్ ఎడ్జ్‌ తీసుకోవడంతో అతను బౌల్డ్‌ అయ్యాడు. దీంతో 9 ఓవర్ల తర్వాత భారత్‌ వికెట్‌ నష్టానికి 94 పరుగులు చేసింది. క్రీజ్‌లో కోహ్లి(20 బంతుల్లో 22), సూర్యకుమార్‌(0) ఉన్నారు.‌

రోహిత్‌ స్టన్నింగ్‌ ఫిఫ్టీ 
ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ తన సహజ శైలీలో విజృంభించాడు. సిక్సర్‌ బాది హాఫ్‌ సెంచరీని పూర్తి చేశాడు. దీంతో 8 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్‌ నష్టపోకుండా 81 పరుగులు చేసింది. రోహిత్‌ 3 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో 53 పరుగులు చేయగా, కోహ్లి(20) ఆచితూచి ఆడుతున్నాడు

బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడుతున్న రోహిత్‌
టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతున్నాడు. దీంతో 7 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్‌ నష్టపోకుండా 70 పరుగులు చేసింది. 

6 ఓవర్ల తర్వాత 60/0
5.2 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 50 పరుగులు దాటింది. వుడ్‌ బౌలింగ్‌లో కోహ్లి సిక్సర్‌ బాదడంతో టీమిండియా 50 పరుగులను క్రాస్‌ చేసింది. 6 ఓవర్లు ముగిసే సమయానికి భారత్‌ వికెట్‌ నష్టపోకుండా 60 పరుగులు చేసింది. క్రీజ్‌లో రోహిత్‌(21 బంతుల్లో 35; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), కోహ్లి(15 బంతుల్లో 17; ఫోర్, సిక్స్‌) ఉన్నారు

టీమిండియా శుభారంభం
కొత్త ఓపెనింగ్‌ జోడితో బరిలోకి దిగిన భారత  జట్టుకు శుభారంభం లభించింది. రెగ్యులర్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ తనదైన శైలిలో బౌండరీలతో విరుచుకుపడడంతో 4 ఓవర్లు ముగిసే సమయానికి టీమిండియా వికెట్‌ నష్టపోకుండా 35 పరగులు చేసింది. క్రీజ్‌లో రోహిత్‌(26), కోహ్లి(8‌) ఉన్నారు

బౌండరీతో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన కోహ్లి
జోఫ్రా ఆర్చర్‌ బౌలింగ్‌లో తాను ఎదుర్కొన్న తొలి బంతినే బౌండరీకి తరలించాడు కోహ్లి. 2 ఓవర్ల తర్వాత టీమిండియా 13/0. క్రీజ్‌లో రోహిత్‌(7 బంతుల్లో 7; ఫోర్‌), కోహ్లి(5 బంతుల్లో 5; ఫోర్‌) ఉన్నారు

తొలి ఓవర్‌ ముగిసాక టీమిండియా స్కోర్‌ 3/0
క్రీజ్‌లో రోహిత్‌(2), కోహ్లి(0) ఉన్నారు

ఓపెనర్‌గా బరిలోకి దిగిన కోహ్లి
ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఇన్నింగ్స్‌ను కెప్టెన్ కోహ్లి‌, వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మలు ప్రారంభించారు.

భారత్, ఇంగ్లండ్‌ జట్ల మధ్య హోరాహోరీగా సాగిన 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ చివరి ఘట్టానికి చేరింది. అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన ఈ పోరులో ఇరు జట్లు 2–2తో సమంగా ఉండగా... నేడు జరిగే ఐదో మ్యాచ్‌లో సిరీస్‌ విజేత ఎవరో తేలనుంది. మొదటి, మూడో మ్యాచ్‌ల్లో మోర్గాన్‌ బృందం విజయం సాధించగా... రెండు, నాలుగు మ్యాచ్‌ల్లో గెలుపు కోహ్లి సేన సొంతమైంది. తొలి మూడు మ్యాచ్‌లకు భిన్నంగా ఉత్కంఠభరితంగా సాగిన గత పోరులో ముందుగా బ్యాటింగ్‌ టీమిండియా 8 పరుగుల తేడాతో ప్రత్యర్ధిపై విజయం సాధించింది. సిరీస్‌ డిసైడర్‌ అయిన ఈ మ్యాచ్‌లో ఎప్పటిలాగే టాస్‌ ఓడిన టీమిండియా.. ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగింది.

ఈ మ్యాచ్‌లో టీమిండియా ఒక మార్పుతో బరిలోకి దిగగా, ఇంగ్లండ్‌ జట్టు గత మ్యాచ్‌లో ఆడిన జట్టునే యధాతధంగా కొనసాగించింది. టీమిండియాలో కేఎల్‌ రాహుల్‌ స్థానంలో లెఫ్ట్‌ ఆర్మ్‌ పేసర్‌ నటరాజన్‌కు అవకాశం లభించింది. సిరీస్‌ మొత్తంలో పేలవ ఫామ్‌తో సతమతమైన రాహుల్‌పై వేటు వేసి అదనపు బౌలర్‌వైపు టీమిండియా మొగ్గుచూపింది. 

తుది జట్లు
భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), రోహిత్, సూర్యకుమార్‌, పంత్, అయ్యర్, హార్దిక్, సుందర్, శార్దుల్, భువనేశ్వర్, రాహుల్‌ చాహర్, నటరాజన్‌‌‌. 
ఇంగ్లండ్‌: మోర్గాన్‌ (కెప్టెన్‌), రాయ్, బట్లర్, మలాన్, బెయిర్‌స్టో, స్టోక్స్, వుడ్‌, సామ్‌ కర్రన్‌, ఆర్చర్, రషీద్, జోర్డాన్‌.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top