India Vs England 1st T20: Fans React As Indian Fielders Drop 6 Catches Against England - Sakshi
Sakshi News home page

Ind Vs Eng 1st T20: టీమిండియా.. మరీ ఇంత చెత్తగానా.. ఇదేం బాలేదు!

Jul 8 2022 9:42 AM | Updated on Jul 8 2022 10:57 AM

Ind Vs Eng 1st T20: Fans Reactions On Indian Fielders Drop 6 Catches - Sakshi

Dinesh Karthik: టీమిండియా.. మరీ ఇంత చెత్తగానా.. ఇదేం బాలేదు డీకే!

India Vs England 1st T20: ఇంగ్లండ్‌ పర్యటనలో భాగంగా తొలి టీ20లో ఘన విజయం నమోదు చేసింది టీమిండియా. ఏకంగా 50 పరుగుల తేడాతో బట్లర్‌ బృందంపై గెలుపొందింది. తద్వారా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో రోహిత్‌ సేన 1-0 తేడాతో ముందంజలో నిలిచింది.

అయితే, ఈ విజయంపై అభిమానులు సంతృప్తిగా ఉన్నప్పటికీ టీమిండియా ఫీల్డింగ్‌ చేసిన తీరుపై మాత్రం పెదవి విరుస్తున్నారు. కాగా సౌతాంప్టన్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు ఏకంగా ఆరు క్యాచ్‌లు వదిలేశారు. 

ఏంటి బాబూ ఇది!
ఆరో ఓవర్‌ మూడో బంతికి భువనేశ్వర్‌ బౌలింగ్‌లో హ్యారీ బ్రూక్‌ ఇచ్చిన క్యాచ్‌ను దినేశ్‌ కార్తిక్‌ మిస్‌ చేశాడు. ఆ తర్వాత హర్షల్‌ పటేల్‌ బౌలింగ్‌లోనూ క్యాచ్‌ వదిలేయడంతో బ్రూక్‌ బతికిపోయాడు.

ఇక పదకొండో ఓవర్లో సూర్యకుమార్‌ యాదవ్‌.. మొయిన్‌ అలీ క్యాచ్‌ మిస్‌ చేయగా.. జోర్డాన్‌కు రెండుసార్లు లైఫ్‌ లభించింది. టైమల్‌ మిల్స్‌ క్యాచ్‌ కూడా భారత ఫీల్డర్లు మిస్‌ చేశారు. 

మరీ ఇంత చెత్తగానా?
ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియా వేదికగా ఫ్యాన్స్‌ టీమిండియా ఫీల్డర్ల తీరును తూర్పారబడుతున్నారు. ‘‘బ్యాటింగ్‌, బౌలింగ్‌ అదరగొట్టారు కాబట్టి సరిపోయింది. లేదంటే ఈ చెత్త ఫీల్డింగ్‌ కారణంగా భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చేది. ఇకనైనా ఫీల్డింగ్‌ నైపుణ్యాలు పెంచుకోవడంపై దృష్టి సారించండి’’ అంటూ హితవు పలుకుతున్నారు.

మరికొంత మంది నెటిజన్లు.. ‘‘టీమిండియా ఫీల్డింగ్‌ మరీ ఇంత చెత్తగా ఉంటుందనుకోలేదు. ముఖ్యంగా డీకే మరీ ఇంత ఘోరంగా క్యాచ్‌లు మిస్‌ చేస్తాడనుకోలేదు. ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌.. మీ ఫీల్డింగ్‌ ఒకేలా ఉంది’’ అంటూ ట్రోల్‌ చేస్తున్నారు.

టీ20 ప్రపంచకప్‌-2022 టోర్నీ సమయానికైనా తప్పులు సరిచేసుకోండి అని సూచిస్తున్నారు. ఇక క్యాచ్‌లు వదిలేయడంపై మ్యాచ్‌ అనంతరం స్పందించిన కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. కచ్చితంగా ఫీల్డింగ్‌ మెరుగుపరచుకుంటామని పేర్కొన్నాడు. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

ఇండియా వర్సెస్‌ ఇంగ్లండ్‌ తొలి టీ20 మ్యాచ్‌:
టాస్‌: ఇండియా- బ్యాటింగ్‌
ఇండియా స్కోరు: 198/8 (20)
ఇంగ్లండ్‌ స్కోరు: 148 (19.3)
విజేత: ఇండియా(50 పరుగుల తేడాతో విజయం)
ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: హార్దిక్‌ పాండ్యా(51 పరుగులు, 4 ఓవర్లలో 33 పరుగులు ఇచ్చి 4 వికెట్లు)

చదవండి: Rohit Sharma: ప్రపంచ రికార్డు సృష్టించిన రోహిత్‌ శర్మ.. ఎవరికీ సాధ్యం కాని రీతిలో!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement