నితీష్ రాణా అవుట్ చుట్టూ రచ్చ? రూల్స్ ఏమి చెబుతున్నాయి? | How Did Nitish Rana Get Out? Rules Explained As Fresh Angle Of Dismissal Sparks Row | Sakshi
Sakshi News home page

IPL 2026: నితీష్ రాణా అవుట్ చుట్టూ రచ్చ? రూల్స్ ఏమి చెబుతున్నాయి?

May 6 2026 9:53 AM | Updated on May 6 2026 10:32 AM

How Did Nitish Rana Get Out? Rules Explained As Fresh Angle Of Dismissal Sparks Row

ఐపీఎల్‌-2026 సీజన్‌లో మరో వివాదం చెలరేగింది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ నితీష్ రాణా ఔటైన తీరు క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. 

స్టార్ ఓపెనర్లు పాథుమ్ నిస్సాంక, కేఎల్ రాహుల్ వరుస ఓవర్లలో పెవిలియన్‌కు చేరారు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన లోకల్ బాయ్ నితీష్ రాణా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ట్రిక్కీ వికెట్‌పై రాణా ఆచితూచి ఆడుతూ క్రీజులో పాతుకుపోయేలా కన్పించాడు. 

ఈ క్రమంలో ఢిల్లీ ఇన్నింగ్స్ 10 ఓవర్ వేసిన నూర్ అహ్మద్ బౌలింగ్‌లో మూడో బంతికి స్వీప్ షాట్ ఆడబోయి డీప్ ఫైన్ లెగ్ ఫీల్డర్‌కు రానా చిక్కాడు. అయితే రాణా బంతిని షాట్ ఆడే క్రమంలో ఒక్కసారిగా వికెట్లపై ఉన్న బెయిల్స్ కింద పడిపోయాయి. దీంతో నితీష్ క్యాచ్ అవుట్ కాదు హిట్ వికెట్ అయ్యాడని అంతా భావించారు. 

కానీ రిప్లేలో చూస్తే బలమైన గాలులు కారణంగా బెయిల్స్ కింద పడిపోయినట్లు స్పష్టమైంది. అయితే స్టంప్స్ కింద పడిపోయాయి కాబట్టి బంతిని డెడ్ బాల్‌గా ప్రకటించాల్సిందని పలువురు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయపడుతున్నాయి. ఇంతకి రూల్స్ ఏమి చెబుతున్నాయో ఓసారి పరిశీలిద్దాం.

హిట్ వికెట్ కాదు..
బ్యాటర్ షాట్ ఆడే క్రమంలో గానీ, పరుగు తీసే సమయంలో గానీ తన బ్యాట్‌తో లేదా శరీరంతో బెయిల్స్‌ను పడగొడితే హిట్ వికెట్‌గా పరిగణిస్తారు. ఈ సందర్భంలో రాణా వికెట్లను తాకలేదు కాబట్టి ఇది హిట్ వికెట్ కాదు. మరోవైపు వికెట్ కీపర్ సంజూ శాంసన్ కారణంగా కూడా స్టంప్స్ పడలేదు. కేవలం గాలులు వల్లే స్టంప్స్ కిందపడిపోయాయి.

డెడ్ బాల్ ఎప్పుడు ప్రకటిస్తారు?
బ్యాటర్‌ దృష్టి మరల్చే విధంగా ఏదైనా అవాంతరం ఏర్పడినప్పుడు డెడ్‌బాల్‌గా అంపైర్‌గా ప్రకటిస్తారు. ఉదహరణకు బౌలర్ బంతిని వేసే క్రమంలో తన కర్చీఫ్ కింద పడటం లేదా తన చేతితో నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో బెయిల్స్‌ను పడగొడితే డెడ్ బాల్‌గా పరిగిణిస్తారు.

అంతేకాకుండా బంతి డెలివరీ అయ్యే ఆఖరి క్షణంలో బ్యాటర్ పక్కకు తప్పుకొన్న డెడ్ బాల్‌గా ప్రకటిస్తారు. కానీ రాణా మాత్రం ఎలాంటి ఎటువంటి అసౌకర్యానికి గురికాకుండా షాట్ ఆడాడు. అంతేకాకుండా బౌలర్ బంతిని విసిరిన తర్వాత బెయిల్స్ పడిపోయాయి. అందుకే అంపైర్లు దాన్ని డెడ్ బాల్‌గా పరిగణించలేదు.


 

 

Advertisement
 
Advertisement
Advertisement