Glenn Maxwell Marriage With His Girlfriend Vini Raman, Wedding Pics Goes Viral - Sakshi
Sakshi News home page

Glenn Maxwell Marriage: గర్ల్‌ఫ్రెండ్‌ను పెళ్లాడిన ఆసీస్‌ విధ్వంసకర ఆటగాడు

Mar 19 2022 11:20 AM | Updated on Mar 23 2022 6:29 PM

Glenn Maxwell Ties Knot With Indian-origin Girlfriend Vini Raman - Sakshi

ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ తన గర్ల్‌ఫ్రెండ్‌.. భారత సంతతికి చెందిన వినీ రామన్‌ను శనివారం పెళ్లి చేసుకున్నాడు. దీనికి సంబంధించిన విషయాన్ని మ్యాక్సీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. రింగులు మార్చుకున్న ఫోటోను షేర్‌ చేస్తూ.. ''లవ్‌ అనే పదాన్ని ఈరోజుతో పూర్తి చేశాను.. ఒక పెద్ద ఘట్టం ముగిసింది.. కొత్త జీవితం ఆరంభం'' అంటూ క్యాప్షన్‌ జత చేశాడు. అటు మ్యాక్సీ గర్ల్‌ఫ్రెండ్‌ వినీ రామన్‌ కూడా ఇన్‌స్టాలో స్పందించింది. ''18.03.2022.. జీవితంలో మరిచిపోలేని రోజు. ఇక్కడి నుంచి మా కొత్త జీవితం ప్రారంభం కానుంది.'' అని రాసుకొచ్చింది.

ఇక మ్యాక్స్‌వెల్‌ వివాహం సందర్బాన్ని పురస్కరించుకొని ట్విటర్‌ వేదికగా ఆర్‌సీబీ శుభాకాంక్షలు తెలిపింది. మ్యాక్సీ, వినీ రామన్‌ పెళ్లిపై ఆర్సీబీ ఫ్యామిలీ సంతోషంగా ఉంది. కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న వేళ ఈ ఇద్దరికి ఆల్‌ ది బెస్ట్‌.. మీ జీవితం హయిగా, ఆనందంగా సాగిపోవాలని కోరుకుంటున్నాం అంటూ తెలిపింది.

ఇక నాలుగేళ్ల కిందట పరిచయమైన ఈ ఇద్దరు నాలుగేళ్లపాటు ప్రేమించుకున్నారు. ఫిబ్రవరి 2020లో మ్యాక్సీ, వినీ రామన్‌లు ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారు. కొంతకాలం కిందట వీరి పెళ్లిపత్రిక సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. వినీ రామన్‌ స్వస్థలం తమిళనాడు కావడంతో తమిళ భాషలో పెళ్లి పత్రిక లీక్‌ కావడం అందరిని ఆకట్టుకుంది. భారతీయ సంప్రదాయం పట్ల మ్యాక్స్‌వెల్‌కున్న అభిమానాన్ని అందరూ మెచ్చుకున్నారు.


కాగా ఐపీఎల్‌ మెగా వేలానికి ముందే ఆర్సీబీ.. మ్యాక్స్‌వెల్‌ను రూ.11 కోట్లతో రిటైన్‌ చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి నేపథ్యంలోనే మ్యాక్సీ పాకిస్తాన్‌ టూర్‌కు దూరంగా ఉన్నాడు. మరో వారంలో ఐపీఎల్‌ 15వ సీజన్‌ ఆరంభం కానుండడంతో మ్యాక్సీ నేరుగా ఆర్‌సీబీ జట్టుతో కలవనున్నాడు.

చదవండి: Glenn Maxwell Marriage: మూడు ముళ్లు.. ఏడు అడుగులు.. మెల్‌బోర్న్‌లో గ్లెన్‌ మాక్స్‌వెల్‌ పెళ్లి

Yastika Bhatia: 'క్రికెట్‌లో రాణించేందుకు ఇష్టమైనవి వదులుకున్నా'

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement