
టీమిండియా స్పిన్నర్ అక్షర్ పటేల్ వికెట్ సాధించాడు. అదేంటి అతను ఒక బౌలర్.. వికెట్ సాధించడంలో గొప్పేముంది అనుకుంటే పొరపాటే. టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్నబోర్డర్-గావస్కర్ ట్రోఫీలో అక్షర్ తొలి మూడు టెస్టులు కలిపి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అయితే బ్యాటింగ్‌లో మాత్రం అదరగొట్టిన అక్షర్ పటేల్ టీమిండియా తరపున రెండో టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. మూడు టెస్టుల్లో నాలుగు ఇన్నింగ్స్‌లు కలిపి 185 పరుగులు చేసిన అక్షర్ ఖాతాలో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఆల్‌రౌండర్ అనే ట్యాగ్ ఉన్న అక్షర్ బ్యాట్‌తో రాణించినప్పటికి బంతితో మాత్రం విఫలమయ్యాడు. ఈ క్రమంలోనే నాలుగో టెస్టులో ఆసీస్ ఇన్నింగ్స్‌కు మూలస్తంభంలా నిలిచిన ఉస్మాన్ ఖవాజా(180 పరుగులు) వికెట్‌ను అక్షర్ దక్కించుకోవడం విశేషం. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఖవాజా ఎల్బీగా వెనుదిరిగాడు. మొత్తంగా ఈ సిరీస్‌లో 47.4 ఓవర్లు బౌలింగ్ చేసిన తర్వాత వికెట్ పడగొట్టాడు. అక్షర్ పటేల్ తన టెస్టు కెరీర్‌లో ఒక వికెట్ తీయడం కోసం ఎదుర్కొన్న అతిపెద్ద గ్యాప్ ఇదే. చివరగా బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులో అక్షర్ పటేల్ మూడు వికెట్లు తీశాడు.
Axar Patel gets the BIG WICKET! 🙌
— OneCricket (@OneCricketApp) March 10, 2023
Usman Khawaja goes for 180(422) 👏#IndvsAus #BGT2023 #UsmanKhawaja #Cricket pic.twitter.com/7j2PfVKFxf