
కాగా టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మను పోలి ఉన్న ఓ వ్యక్తి పాకిస్తాన్‌లోని
Spot Rohit Sharma’s Doppelganger on Pakistan: ప్రపంచంలో ఒకే పోలికతో ఏడుగురు ఉన్నారన్నది నిజమని చాలా మంది నమ్ముతుంటారు. అయితే, మనిషిని పోలిన మనిషి కనిపించడం అరుదుగా జరగుతుంది. కాగా టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మను పోలి ఉన్న ఓ వ్యక్తి పాకిస్తాన్‌లోని అభిమానులకు దర్శనమిచ్చాడు. ఓ షాప్ దగ్గర జ్యూస్ తాగుతూ కనిపించాడు. ఆ వ్యక్తి చూడడానికి అచ్చం రోహిత్ శర్మలానే ఉన్నాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఫోటోపై నెటిజన్లు మీమ్స్ వర్షం కురిపిస్తున్నారు.
ఈ ఫోటో పై ఓ పాకిస్తానీ అభిమాని స్పందిస్తూ.. "అంతర్జాతీయ క్రికెటర్లు పర్యటించడానికి పాకిస్తాన్ సురక్షితం కాదని కాదని ఎవరు చెప్పారు? ఇప్పుడే స్టార్ ఇండియన్ ప్లేయర్ రోహిత్ శర్మ, రావల్పిండి సద్దర్ వద్ద జ్యూస్ తాగాడం చూశాను" అని ట్వీట్ చేశాడు. మరో అభిమాని ఐపీఎల్ సెకెండ్ ఫేజ్ లో ముంబై పరాజయాల ఒత్తిడిని తట్టుకోవడానికి రోహిత్‌కు ఈ జ్యూస్ చాలా అవసరమని ట్వీట్ చేశాడు. కాగా భద్రతా కారణాల దృష్ట్యా న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లు పాక్ పర్యటనను రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. మరో వైపు ఐపీఎల్ సెకెండ్ ఫేజ్‌లో వరుస అపజయాలతో ముంబై పాయింట్ల పట్టికలో 7వ స్ధానంలో ఉంది.
చదవండి: Virat Kohli: టీ20 ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ ఆ స్ధానంలో బ్యాటింగ్‌కు రావాలి