Kohli Replacement: కోహ్లి వారసుడి ఎంపికపై బీసీసీఐ అప్‌డేట్‌..!

Enough Time To Decide On Replacement Of Virat Kohli Says BCCI Official - Sakshi

టీమిండియా టెస్ట్‌ కెప్టెన్‌గా విరాట్ కోహ్లి తప్పుకోవడంతో అతని వారసుడు ఎవరనే అంశంపై క్రికెట్‌ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతుంది. ప్రస్తుతం వైస్‌ కెప్టెన్‌గా ఉన్న రోహిత్‌ శర్మనే తదుపరి కెప్టెన్‌ అంటూ కొందరు.. కేఎల్‌ రాహుల్‌ లేదా యువ ఆటగాళ్లకు అవకాశం కల్పిస్తే బాగుంటుందని మరికొందరు చర్చించుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో బీసీసీఐ ఉన్న‌తాధికారి ఒక‌రు ప్రముఖ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. కోహ్లి వారసుడి ఎంపికపై అప్‌డేట్‌ ఇచ్చాడు.

టీమిండియా తదుపరి టెస్ట్‌ కెప్టెన్ ఎవ‌ర‌నే అంశంపై ఇప్ప‌టిక‌వ‌ర‌కు ఎలాంటి చర్చ జరగలేదని, అందుకు ఇంకా చాలా స‌మ‌యం ఉంద‌ని చెప్పుకొచ్చాడు. కొత్త కెప్టెన్‌ విషయమై బీసీసీఐ పూర్తి క్లారిటీతో ఉందని, నిర్ణీత స‌మ‌యంలోగా కెప్టెన్ ఎంపిక‌ పూర్తవుతుందని, సెలెక్షన్‌ కమిటీ సిఫార్సు తర్వాతే అధికారిక ప్రకటన ఉంటుందని స్పష్టం చేశాడు. కొత్త కెప్టెన్ రేసులో కేఎల్ రాహుల్ అంశంపై మీడియా ప్ర‌శ్నించ‌గా.. సహజంగానే ఈ పదవికి పోటీ చాలానే ఉంటుందంటూ మాట దాట వేశాడు. 

ఇదిలా ఉంటే, టీమిండియా టెస్ట్‌ కెప్టెన్సీ రేసులో ముగ్గురి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌లతో పాటు రిష‌బ్ పంత్ పేరును సైతం కొందరు మాజీలు సిఫార్సు చేస్తున్నారు. పంత్‌కు అతని వయసు అడ్వాంటేజ్‌గా మారగా.. రాహుల్, రోహిత్‌లకు ఐపీఎల్‌ కెప్టెన్సీ అనుభవం అనూకూలంగా మారే అవకాశం ఉంది. మొత్తంగా వచ్చే నెలలో శ్రీ‌లంక‌తో జరగనున్న టెస్ట్‌ సిరీస్ నాటికి టీమిండియా కొత్త టెస్ట్‌ కెప్టెన్‌ ఎంపిక జరగనుంది.
చదవండి: Viral Pic: పాపం కోహ్లి.. ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయాడు..!
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top