రిటైర్డ్‌ హర్ట్‌, రిటైర్డ్‌ ఔట్‌ మధ్య తేడా ఇదే..! | difference between retired hurt and retired out in cricket | Sakshi
Sakshi News home page

రిటైర్డ్‌ హర్ట్‌, రిటైర్డ్‌ ఔట్‌ మధ్య తేడా ఇదే..!

Apr 16 2026 12:36 PM | Updated on Apr 16 2026 12:51 PM

difference between retired hurt and retired out in cricket

క్రికెట్‌లో రిటైర్డ్‌ హర్ట్‌, రిటైర్డ్‌ ఔట్‌ అన్న పదాలు తరుచూ వినిపిస్తుంటాయి. ఈ రెండు పదాలు ఒకేలా అనిపించినా వాటి నియమాలు, ప్రభావం తేడాగా ఉంటాయి. రిటైర్డ్‌ హర్ట్‌ అంటే బరిలోకి దిగిన ఆటగాడు గాయపడినప్పుడు లేదా అనారోగ్యం బారిన పడినప్పుడు క్రీజ్‌ వదిలి వెళ్తాడు.  

రిటైర్డ్‌ ఔట్‌ విషయానికొస్తే.. వ్యూహాత్మక కారణాల వల్ల బరిలో ఉన్న ఆటగాడు స్వచ్ఛందంగా క్రీజ్‌ వదిలి వెళ్తాడు. టీ20ల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఏవరైనా ఆటగాడు వేగంగా పరుగులు చేయలేకపోతుంటే సంబంధిత జట్లు అతన్ని రిటైర్డ్‌ ఔట్‌గా క్రీజ్‌ వదిలి రమ్మని ఆదేశిస్తాయి. ఈ విధానం గతంలో ఎక్కువగా కనిపించకపోయినా, ఇటీవల బాగా ఎక్కువైంది.

ఒక్కసారి ఆటగాడు రిటైర్డ్‌ ఔట్‌గా క్రీజ్‌ వదిలితే తిరిగి బ్యాటింగ్‌ చేయడానికి వీలుండదు. అదే రిటైర్డ్‌ హర్ట్‌ అయితే మాత్రం వికెట్‌ పడినప్పుడు లేదా ఇన్నింగ్స్‌ చివర్లో తిరిగి బ్యాటింగ్‌కు రావచ్చు.  

రిటైర్డ్‌ హర్ట్‌గా క్రీజ్‌ వదిలితే నాటౌట్‌గా పరిగణిస్తారు. దీని వల్ల ఆటగాడి బ్యాటింగ్‌ సగటుపై నెగిటివ్‌ ప్రభావం ఉండదు. అదే రిటైర్డ్‌ ఔట్‌గా క్రీజ్‌ వదిలితే సదరు ఆటగాడు ఔట్‌గా పరిగణించబడతాడు. దీని వల్ల అతని బ్యాటింగ్‌ సగటుపై ప్రతికూల ప్రభావం ఉంటుంది.  

ఐసీసీ నియమాల ప్రకారం ఆటగాడు ఎప్పుడైనా రిటైర్‌ కావచ్చు. కానీ గాయం లేదా అనారోగ్యం కాకుండా ఇతర కారణాల వల్ల రిటైర్‌ అయితే, ప్రత్యర్థి కెప్టెన్‌ అనుమతి లేకుండా తిరిగి రావడం సాధ్యం కాదు.  

తాజాగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ తొలుత రిటైర్డ్‌ హర్ట్‌గా క్రీజ్‌ వదిలి తిరిగి బ్యాటింగ్‌ చేశాడు. అయినా దురదృష్టవశాత్తు అతని వెంటనే ఔటయ్యాడు. 

పంత్‌ ఎపిసోడ్‌ నేపథ్యంలోనే ఈ రిటైర్డ్‌ హర్ట్‌-రిటైర్డ్‌ ఔట్‌ ప్రస్తావన వచ్చింది. ఈ సీజన్‌లో రిటైర్డ్‌ హర్ట్‌ అయిన రెండో ఆటగాడు పంత్‌. కొద్ది రోజుల కిందట ఆర్సీబీతోనే జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ కూడా రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు. అయితే అతను పంత్‌లా తిరిగి బ్యాటింగ్‌కు రాలేదు.

ఐపీఎల్‌లో ఇప్పటివరకు రిటైర్ట్‌ హర్ట్‌, రిటైర్డ్‌ ఔటైన ఆటగాళ్లు..

రిటైర్డ్‌ హర్ట్‌
2008- డొమినిక్‌ థోర్న్‌లీ (ముంబై ఇండియన్స్‌)
2010- వీవీఎస్‌ లక్ష్మణ్‌ (డెక్కన్‌ ఛార్జర్స్‌)
2010- హర్భజన్‌ సింగ్‌ (ముంబై ఇండియన్స్‌)
2012- సచిన్‌ టెండూల్కర్‌ (ముంబై ఇండియన్స్‌)
2013- సచిన్‌ టెండూల్కర్‌ (ముంబై ఇండియన్స్‌)
2014- హర్భజన్‌ సింగ్‌ (ముంబై ఇండియన్స్‌)
2015- ఆరోన్‌ ఫించ్‌ (ముంబై ఇండియన్స్‌)
2016- కెవిన్‌ పీటర్సన్‌ (రైజింగ్‌ పూణే జెయింట్స్‌)
2017- కృనాల్‌ పాండ్యా (ముంబై ఇండియన్స్‌)
2018- శిఖర్‌ ధవన్‌ (సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌)
2018- నితీశ్‌ రాణా (కేకేఆర్‌)
2021- అంబటి రాయుడు (సీఎస్‌కే)
2022- రాహుల్‌ త్రిపాఠి (సన్‌రైజర్స్‌)
2023- భానుక రాజపక్స (పంజాబ్‌)
2025- సంజూ శాంసన్‌ (రాజస్థాన్‌)
2026- రోహిత్‌ శర్మ (ముంబై ఇండియన్స్‌)
2026- రిషబ్‌ పంత్‌ (లక్నో)

రిటైర్డ్‌ ఔట్‌
2022- రవిచంద్రన్‌ అశ్విన్‌ (రాజస్థాన్‌)
2023- సాయి సుదర్శన్‌ (గుజరాత్‌)
2023- అథర్వ తైడే (పంజాబ్‌)
2025- తిలక్‌ వర్మ (ముంబై ఇండియన్స్‌)
2025- డెవాన్‌ కాన్వే (సీఎస్‌కే)
2026- ఆయుశ్‌ మాత్రే (సీఎస్‌కే)

Advertisement
 
Advertisement
Advertisement